Shayaji Shinde : సినిమా ఇండస్ట్రీలో విలన్స్ కి చాలా మంచి క్రేజ్ ఉంటుంది. హీరోలతో సమానమైన పాత్రను పోషిస్తూ హీరోలను ఢీకొట్టే పాత్రల్లో తమను తాము మార్చుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. వాళ్లు చేసే ప్రతి పాత్రలతో ప్రేక్షకుల్లోకి వెళుతుంటారు. నిజానికి ఒక విలన్ ని ఎంతమంది తిట్టుకుంటే ఆయనంత మంచి విలన్ గా పాపులారిటి ని సంపాదించుకుంటాడు. కాబట్టి ఒక సినిమాలో విలన్ పాత్ర అనేది చాలా కీలకం అందుకే ఒకప్పుడు కోట శ్రీనివాసరావు, ప్రదీప్ రావత్, షాయాజీ షిండే, ముఖేష్ ఋషి లాంటి విలన్లు తమదైన రీతిలో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చారు…కానీ కాలక్రమేణ వీళ్లేవ్వరికి పెద్దగా అవకాశాలైతే రావడం లేదు. ముఖ్యంగా షాయాజీ షిండే కి అయితే ఎవరు పెద్దగా అవకాశాలు ఇవ్వడం లేదు. నిజానికి చూడటానికి ఈయన విలన్ గా అనిపించనప్పటికీ ఆయన హావభావాలతో ఆయన డైలాగ్ డెలివరీ తో విలనిజాన్ని పండిస్తూ ఉంటాడు…ఇక ఇప్పటివరకు ఉన్న స్టార్ హీరోలందరి సినిమాల్లో విలన్ గా నటించిన ఈయన ఇప్పుడు మాత్రం విలన్ పాత్ర లని చేయడం లేదు. అసలాయనకి సినిమాల్లో పెద్దగా అవకాశాలు కూడా రావడం లేదు. వచ్చిన ఏదో ఒక చిన్న పాత్ర కోసం అతన్ని తీసుకుంటున్నారు తప్ప విలన్ గా మాత్రం ఆయనకు అవకాశాలు ఇవ్వడం లేదు…
మరి ఇలాంటి సందర్భంలో షాయాజీ షిండే కి ఎందుకు విలన్ గా అవకాశాలు రావడం లేదు. అతన్ని ఎవరు తొక్కేశారు అంటూ కొన్ని వార్తలైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి ఆయన్ని ఎవరు తొక్కలేదు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శక నిర్మాతలు విలనిజాన్ని పండించాలనే ఉద్దేశ్యంతో కొంతమంది హీరోలను విలన్స్ గా మారుస్తున్నారు.
ముఖ్యంగా ఫేయిడ్ అవుట్ అయిపోయిన హీరోలను విలన్లు గా తీసుకురావడంతో అప్పటివరకు ఉన్న విలన్స్ అందర్నీ కామెడీయన్స్ గా మారుస్తున్నారు. దానివల్ల సరైన విలనిజాన్ని పండించే నటులు ఎక్కువగా కనిపించడం లేదు. ఇక లెజెండ్ సినిమాతో విలన్ గా మారిన జగపతిబాబు కూడా చాలా సినిమాల్లో విలన్ పాత్రలను పోషిస్తూ వస్తున్నాడు.
కాబట్టి అప్పటివరకు విలన్స్ గా చేస్తున్న షియాజీ షిండే, ఆశిష్ విద్యార్థి లాంటి విలన్స్ కి అవకాశం లేకుండా పోతుంది… ఇక దీనివల్ల వాళ్లకు విలన్స్ గా చేసే అవకాశాలను పక్కనపెట్టి సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించినప్పటికీ అవి వాళ్ళకి ఏ రకంగానూ హెల్ప్ కావడం లేదు….