https://oktelugu.com/

Allu Arjun : అల్లు అర్జున్ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్న ఆ పార్టీ కార్యకర్తలు…కారణం ఏంటి..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళను వాళ్ళు స్టార్ హీరోలుగా ఎలివేట్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఇక పెద్ద హీరోలు వాళ్ల సినిమాలతో భారీ రికార్డులను క్రియేట్ చేస్తుంటే చిన్న హీరోలు మాత్రం భారీ సక్సెస్ లను సాధించడంలో కొంతవరకు వెనకబడిపోతున్నారు. అలాగే పాన్ ఇండియాలో కూడా మంచి గుర్తింపు సంపాదించుకోవడంలో వాళ్లకు తగిన గుర్తింపు రావడం లేదు...

Written By:
  • Gopi
  • , Updated On : November 5, 2024 / 11:25 AM IST

    Those party workers who are damaging Allu Arjun's image...what is the reason..?

    Follow us on

    Allu Arjun : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న వరుస సినిమాలు ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను రేకత్తిస్తున్నాయి. ఇక ఇప్పుడు సుకుమార్ డైరెక్షన్ లోనే చేస్తున్న పుష్ప 2 సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇక పుష్ప మొదటి పార్ట్ తోనే నేషనల్ అవార్డుని గెలుచుకున్న అల్లు అర్జున్ సెకండ్ పార్ట్ తో అంతకుమించి తన నట విశ్వరూపాన్ని చూపించాలని చూస్తున్నాడు. మరి సెకండ్ పార్ట్ తో కూడా మంచి విజయాన్ని అందుకుంటాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడంలో కీలక పాత్ర వహిస్తున్నాడు…ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి కూడా వస్తుందని భావిస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఏపీలో ఇంతకు ముందు జరిగిన ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ కి పోటీగా వైసిపి పార్టీకి సపోర్ట్ చేశాడు. ఇక దాంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దృష్టిలో అల్లు అర్జున్ చాలా వరకు బ్యాడ్ అయిపోయాడనే చెప్పాలి.

    ఇక ఇప్పుడు వైసిపి పార్టీ కార్యకర్తలు కొంతమంది పుష్ప 2 పోస్టర్లను అంటిస్తూ ‘మాకు అడ్డు ఎవడు లేడు’ అంటూ దానిమీద క్యాప్షన్స్ రాస్తూ అంటిస్తున్నారు. దీనివల్ల ఇన్ డైరెక్ట్ గా వైసిపి వాళ్లు జనసేన పార్టీ లీడర్లను గాని పవన్ కళ్యాణ్ అభిమానులను గాని ఉద్దేశించే ఇలాంటి పోస్టర్లను అంటిస్తున్నారు అంటూ కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.

    మరి మొత్తానికైతే వైసీపీ వాళ్లు చేసే ఇలాంటి పబ్లిసిటీ వల్ల అల్లు అర్జున్ కెరీర్ భారీగా డ్యామేజ్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు సినిమా రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి ఆ సినిమా మీద భారీ ఎఫెక్ట్ అయితే పడే అవకాశాలు ఉన్నాయి. మరి ఇలాంటి విషయాల్లో అల్లు అర్జున్ కొంత వరకు కేర్ ఫుల్ గా వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉంది.

    లేకపోతే మాత్రం ఆయన సినిమాకి భారీగా కలెక్షన్స్ తగ్గిపోయే అవకాశాలు కూడా ఉన్నాయంటూ సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేయడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడంలో మంచి గుర్తింపును సంపాదించుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు కనక కొంచెం తెలివిగా వ్యవహరించకపోతే మాత్రం ఆయన సినిమాకి భారీగా దెబ్బ పడే అవకాశాలు ఉన్నాయి…