Heroes : సౌత్ లో డిఫరెంట్ సినిమాలు చేస్తున్న యంగ్ హీరోలు వీళ్లే…అందుకే వీళ్ళకి అంత క్రేజ్…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటులు చాలామంది ఉన్నారు. కానీ యంగ్ హీరోలు వాళ్ళ పంథాను మార్చుకొని సినిమాలు చేస్తు ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా తమ అభిమానులుగా కూడా మార్చుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు... ఇక ఏది ఏమైనా కూడా ఇక్కడ సక్సెస్ ఒకటే కీలకపాత్ర వహిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా సక్సెస్ సాధించాల్సిన అవసరమైతే ఉంది...

Written By: Gopi, Updated On : November 6, 2024 12:02 pm

These are the young heroes who are doing different films in South...that's why they are so crazy...

Follow us on

Heroes : ప్రతి సినిమా ఇండస్ట్రీ లో ఉన్న హీరోలు కూడా ప్రస్తుతం ఫ్యాన్ ఇండియా లెవెల్లో ముందుకు దూసుకెళ్ళడమే లక్ష్యం గా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఇక ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది హీరోలు మాత్రం వైవిధ్యమైన కథంశాలను ఎంచుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా ప్రేక్షకులను అలరించడమే కాకుండా వాళ్ళకంటూ ఒక సపరేటు ఐడెంటిటి ని కూడా క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం పాన్ ఇండియాలో చాలా ముందు వరుసలో ఉందనే చెప్పాలి. ఇక సౌత్ లో మంచి సినిమాలను చేస్తున్న హీరోల్లో దుల్కర్ సల్మాన్ మొదటి స్థానంలో ఉండగా, తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాని, తమిళ్ సినిమా ఇండస్ట్రీలో శివ కార్తికేయన్ లాంటి హీరోలు వరుస సినిమాలను చేసుకుంటూ పాన్ ఇండియా గుర్తింపును కూడా సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. వీళ్ళు ముగ్గురు చేసే సినిమాలు ప్రేక్షకులందరిని ఆకట్టుకుంటున్నాయి. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా ప్రతి ప్రేక్షకుడు కూడా వీళ్ళ సినిమాలకు కనెక్ట్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటి అంటే వీళ్ళ యాక్టింగ్ అనే చెప్పాలి.

జన్యూన్ యాక్టింగ్ తో వీళ్ళు ప్రతి ప్రేక్షకుడిని మెప్పిస్తూ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే ప్రయత్నంలో చాలా బిజీగా ఉన్నారు. ప్రతి క్యారెక్టర్ లో పరకాయ ప్రవేశం చేస్తూ ఆ క్యారెక్టర్ తాలూకు ఇంటెన్స్ పట్టుకొని ఆడియన్స్ లో ఒక మ్యాజిక్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇక వీళ్ళు హిట్టు కొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. రీసెంట్ గా ఈ ముగ్గురు హీరోలు కూడా విజయాలను అందుకున్న విషయం మనకు తెలిసిందే.

ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో ఈ స్టార్ హీరోలు తమదైన రేంజ్ లో ముందుకు దూసుకెళ్తున్నారనే చెప్పాలి. ఇక ఇప్పటికే వీళ్ళకి మంచి క్రేజ్ అయితే ఏర్పడింది. ఒక భారీ సక్సెస్ కనక పడితే వీళ్ళు కూడా స్టార్ హీరో రేంజ్ ని టచ్ చేస్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

వీళ్ళు ముఖ్యంగా కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేయడం వల్ల ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను కూడా సంపాదించుకుంటున్నారు. ఇక కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాల జోలికి వెళ్లకుండా కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలకే వీళ్ళు పరిమితం అవ్వడం అనేది నిజంగా చాలా మంచి విషయం అనే చెప్పాలి…