https://oktelugu.com/

Chiranjeevi : చిరంజీవి సినిమాను సైతం రిజెక్ట్ చేసిన స్టార్స్ వీళ్లే…

ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నప్పటికి చిరంజీవికి మాత్రం చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. ఆయన సినిమాలని చాలామంది చూస్తూ ఆయనను ఇన్స్పిరేషన్ గా తీసుకొని సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లు కూడా చాలామంది ఉన్నారనే చెప్పాలి... ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి లాంటి గొప్ప నటుడు సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడు కూడా తనదైన రీతిలో సినిమాలను చేస్తూ సేవలను అందిస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : November 1, 2024 / 12:02 PM IST

    These are the stars who also rejected Chiranjeevi's movie...

    Follow us on

    Chiranjeevi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనతో సినిమా చేయడానికి చాలామంది దర్శక నిర్మాతలు పోటీ పడుతూ ఉంటారు. ఇక నటి నటులు అయితే ఆయన సినిమాలో చిన్న అవకాశం వచ్చినా సరే నటించడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే ఆయనతో సినిమాలు చేయడం వల్ల తన ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా తమకు కూడా హెల్ప్ అవుతుందని అనుకుంటూ ఉంటారు. అలాగే చిరంజీవిని అభిమానించే మెగా ఫ్యాన్స్ అందరూ తమకు సపోర్టుగా నిలుస్తారని భావిస్తూ ఉంటారు. అందువల్లే సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది మెగాస్టార్ చిరంజీవి సినిమాలో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం చిరంజీవి సినిమాలో అవకాశం వచ్చిన నటించలేదు కారణం ఏంటంటే వాళ్లకు ఆ పాత్రలు నచ్చకపోవడమే అని కొంతమంది చెబుతున్నారు. నిజానికి ఆయన సినిమాల్లో అవకాశాలను రిజెక్ట్ చేసిన నటి నటులు ఎవరో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    సాయి పల్లవి…

    చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ‘భోళాశంకర్ ‘ సినిమాలో సాయిపల్లవిని చిరంజీవి చెల్లెలి పాత్ర కోసం అడిగారట. కానీ అది రీమేక్ సినిమా కావడం వల్ల వేరే భాషలో ఒకరు చేసిన పాత్రను మళ్ళీ చేయడం అనేది సాయి పల్లకి నచ్చకపోవడంతో ఆ పాత్రను రిజెక్ట్ చేసింది. నిజానికి చిరంజీవి చెల్లిగా చేయాలనే అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరు ఆ అవకాశాన్ని వాడుకుంటారు. కానీ తను మాత్రం అలా చేయలేదు…

    విజయ్ దేవరకొండ

    సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్టార్ డమ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు విజయ్ దేవరకొండ…ఈయన యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకోవడమే కాకుండా ఎలాంటి క్యారెక్టర్ లో ఆయన ఒదిగిపోయి నటించగలిగే కెపాసిటీ ఉన్నటువంటి నటుడిగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడంలో ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవి తమ్ముడిగా రవితేజ చేసిన క్యారెక్టర్ ని మొదట విజయ్ దేవరకొండతో చేయించాలనే ప్రయత్నం చేశారట.

    కానీ విజయ్ దానికి నో చెప్పడంతో ఆ పాత్రను రవితేజ చేసి సినిమాకి మంచి విజయాన్ని కట్టబెట్టాడు…మరి విజయ్ ఈ పాత్రను రిజెక్ట్ చేయడానికి గల కారణం ఏంటి అంటే ఆ పాత్రను తను సక్రమంగా చేయలేననే ఉద్దేశ్యంతోనే ఆ పాత్రను ఆయన రిజెక్ట్ చేశానని చెప్పాడు…