https://oktelugu.com/

Boyapati Srinu : బోయపాటి శ్రీను దర్శకత్వం లో సినిమాలను చేసి దెబ్బ తిన్న స్టార్ హీరోలు వీళ్లే…

సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి మంచి కాన్సెప్ట్ లో ఎంచుకొని సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు.మరి ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాల పట్ల ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ అయితే ఉంటుంది. మరి ఆ క్రేజ్ ని అందుకోవడానికి వాళ్ళు అహర్నిశలు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అయితే కొన్నిసార్లు సినిమాలు సక్సెస్ అవ్వచ్చు మరి కొన్నిసార్లు ఫెయిల్యూర్ ని మూట గట్టుకోవచ్చు. ఇక ఏది ఏమైనా కూడా దర్శకులు సినిమాను మాత్రమే నమ్ముకొని ముందుకు దూసుకెళ్తుంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : November 7, 2024 / 10:06 AM IST

    These are the star heroes who made movies under the direction of Boyapati Srinu and got hit...

    Follow us on

    Boyapati Srinu :తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకులకు మంచి గుర్తింపు అయితే ఉంది. నిజానికి మాస్ సినిమాలను చేస్తూ స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన వారిలో బోయపాటి శ్రీను ఒకరు. ఒకప్పుడు రాజమౌళి వి వి వినాయక్ లాంటి దర్శకులు స్టార్ డైరెక్టర్లుగా తమకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక వాళ్ళ బాటలోనే బోయపాటి శ్రీను కూడా నడవడం విశేషం… ఇక తనకంటూ ఒక సపరేటు ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవడంలో ఆయన మొదటి నుంచి చాలా వరకు సక్సెస్ అవుతూనే వచ్చాడు. ఇక ఏది ఏమైనా కూడా ఆయన చేసే ప్రతి సినిమా ప్రేక్షకుడిలో ఒక అటెన్షన్ ని క్రియేట్ చేయడమే కాకుండా ఆయా హీరోలకు కూడా మాస్ ఇమేజ్ ని తీసుకొచ్చి పెడుతున్నాయనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేస్తున్న సినిమాలు ఎలాంటి సక్సెస్ లను సాధించబోతున్నాయి అనేది కూడా ఇప్పుడు ప్రేక్షకుల్లో ఒక క్యూరియాసిటీ రేకర్తిస్తున్నాయనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఆయన తనకంటూ ఒక భారీ గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నాడు. ఇక అందులో భాగంగానే బాలయ్య బాబుతో ఇప్పుడు అఖండ 2 సినిమాని కూడా చేస్తూ దాన్ని భారీ హిట్టుగా నిలిపే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే బోయపాటి బాలయ్య బాబుతో మాత్రమే వరుస సక్సెస్ లను సాధిస్తున్నాడు. మిగతా యంగ్ హీరోలతో సినిమాలు చేసినప్పుడు ఆయన సక్సెస్ ను సాధించలేకపోతున్నాడు.

    నిజానికి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాలను భారీ డిజాస్టర్లుగా మార్చడంతో చాలామందికి బోయపాటి సినిమాల మీద నమ్మకం అయితే లేకుండా పోతుంది. ఇక బాలయ్య బాబుతో సినిమా చేస్తే సక్సెస్ దక్కుతుంది. కానీ మిగతా హీరోలతో చేసినప్పుడు ఆయన ఎందుకు అంత ప్రభావాన్ని చూపించలేకపోతున్నాడనేది కూడా ఇప్పుడు చర్చనియాంశంగా మారుతుంది.

    ఇక మొత్తానికైతే ఆయన లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మాస్ మసాలా సినిమాలను చేస్తూ కమర్షియల్ ఎంటర్ టైనర్ లను అందించడంలో ముందు వరుసలో ఉంటున్నాడు. అందుకే ఆయనకు పెద్ద హీరోల నుంచి కూడా అవకాశాలు రావడం విశేషం.

    ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు బాలయ్య బాబుతో నాలుగో సక్సెస్ ని కనక సాధించినట్లైతే వీళ్ళ కాంబినేషన్ ను ఢీకొట్టే మరో కాంబినేషన్ ఉండదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…చూడాలి మరి బాలయ్య బోయపాటి కాంబో వర్కౌట్ అవుతుందా లేదా అనేది…