NTR : ఎన్టీయార్ తో సినిమాలు చేసి సూసైడ్ చేసుకోవాలనుకున్న ప్రొడ్యూసర్స్ వీళ్లే…
జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. రీసెంట్ గా దేవర సినిమాతో సక్సెస్ ని అందుకున్న ఆయన భారీ కలెక్షన్ల ను కొలగొట్టడంలో మాత్రం విఫలమవుతున్నాడు. ఈ సినిమా కేవలం 300 కోట్లు మాత్రమే రాబట్టడం విశేషం...
NTR : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి తారక రామారావు తనదైన ముద్రను వేస్తూ ఒకప్పుడు సక్సెస్ ఫుల్ సినిమాలను చేశాడు. అలాగే ఆయన చేసిన సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని కూడా పెంచాడు. నిజానికి ఆయన వల్లే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈరోజు ఈ స్థాయిలో ఉందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్య పోటీని తట్టుకొని మరి తెలుగు సినిమా ఇండస్ట్రీ ని టాప్ లెవెల్ కి తీసుకెళ్లిన ఘనుడు కూడా అతనే కావడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా తన తర్వాత నందమూరి ఫ్యామిలీ నుంచి బాలయ్య బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు వచ్చారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. పాన్ ఇండియాలో సూపర్ స్టార్ గా ఎదగడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్ గా వచ్చిన దేవర సినిమాతో 300 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టాడు. నిజానికి ఈ సినిమాకి భారీ కలెక్షన్లు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ ఆశించిన మేరకు సక్సెస్ కాకపోవడంతో ఈ సినిమా 300 కోట్ల కలెక్షన్లతోనే సరిపెట్టుకుంది… ఇక ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ఒకప్పుడు చేసిన కొన్ని సినిమాలు ఆయన ప్రొడ్యూసర్స్ కి విపరీతమైన నష్టాలను మిగిల్చాయి. నరసింహుడు సినిమాతో డిజాస్టర్ ని అందుకున్న ఎన్టీఆర్ ఆ సినిమా ప్రొడ్యూసర్ అయిన చెంగల వెంకట్రావ్ సూసైడ్ చేసుకోవడానికి ట్యాంక్ బండ్ మీదకి ఎక్కి దూకిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా భారీ నష్టాన్ని మిగిల్చింది…
ఇక శక్తి సినిమాతో భారీ డిజాస్టర్ ని మూట గట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమాతో తన ఇమేజ్ ని భారీగా డ్యామేజ్ చేసుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఆ సినిమా ప్రొడ్యూసర్ అయిన అశ్విని దత్ కి దాదాపు 40 కోట్ల వరకు నష్టం రావడంతో ఆయన చాలా సంవత్సరాల పాటు సినిమాలు చేయకుండా ఖాళీగానే ఉన్నారు.
ఇలా జూనియర్ ఎన్టీఆర్ డిజాస్టర్ లను ఇవ్వడంతో ఆయా ప్రొడ్యూసర్లు డీలా పడిపోతున్నారు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా హీరోయిన్ శ్రేయ శరన్ జూనియర్ ఎన్టీఆర్ మీద సంచలన కామెంట్లు చేసింది. ఆయన హీరోగా శ్రేయ, జెనీలియా హీరోయిన్లుగా వచ్చిన ‘నా అల్లుడు’ సినిమా ప్రొడ్యూసర్ షూటింగ్ మొత్తం పూర్తి అయిన తర్వాత ఇంకా సినిమా రిలీజ్ అవ్వకముందే ఓవర్ బడ్జెట్ అయిందనే విషయంతో ఆయన సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేశారని రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం విశేషం…
ఇక మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ ప్రొడ్యూసర్లు వరుసగా సూసైడ్ అటెంప్ట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయమనే చెప్పాలి. ఎందుకంటే ఆయన సినిమాలు భారీ ప్లాపులుగా మిగులుతుంటే ఆ ప్రొడ్యూసర్లు సూసైడ్ చేసుకోని విధంగా ముందుకు సాగుతున్నారు.