https://oktelugu.com/

cinematographers : మొదట సినిమాటోగ్రాఫర్లు గా చేసి ఆ తర్వాత స్టార్ డైరెక్టర్లు గా ఎదిగిన వాళ్ళు వీళ్లే..?

సినిమా ఇండస్ట్రీలో ఏరోజు ఎవరు ఏ పొజిషన్ లో ఉంటారు అనేది ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఒక్క సినిమా సక్సెస్ సాధిస్తే చాలు ఇండస్ట్రీ మొత్తం తమ వైపు చూస్తుంది. అలాగే ఒక ఫ్లాప్ వచ్చిందంటే చాలు ఇండస్ట్రీలో ఎవరు పట్టించుకోరు. అందువల్లే సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది చాలా కీలకం. ప్రస్తుతం ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నా కూడా సక్సెస్ వస్తేనే వాళ్లకి ఇక్కడ ఆదరణ అయితే దక్కుతుంది. లేకపోతే మాత్రం వారిని ఆదరించే వారు ఉండరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు...

Written By:
  • Gopi
  • , Updated On : November 22, 2024 11:10 am
    These are the people who first became cinematographers and then became star directors..?

    These are the people who first became cinematographers and then became star directors..?

    Follow us on

    సినిమా ఇండస్ట్రీలో చాలామంది టార్గెట్ డైరెక్షన్ చేయడమే… దానికి కారణం ఏంటంటే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అన్నట్టుగా డైరెక్టర్ చేతిలోనే అంతా ఉంటుంది. కాబట్టి తను ఒక్కడే లీడ్ చేసుకుంటూ సినిమా మొత్తాన్ని ది బెస్ట్ ఔట్ పుట్ వచ్చే విధంగా తీర్చిదిద్దే ప్రణాళికలు రూపొందించుకుంటాడు. అందువల్లే ప్రతి ఒక్క టెక్నీషియన్ కూడా డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటూ ఉంటారు. ఇక అందుకే ఇప్పుడు చాలామంది కొరియోగ్రాఫర్లు సినిమాటోగ్రాఫర్లు కూడా దర్శకులుగా మారి రాణిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే కొంతమంది సినిమాటోగ్రాఫర్లు మొదట వాళ్ల ఫీల్డ్ లో మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత దర్శకత్వాన్ని చేసి దర్శకులుగా కూడా మంచి ఆదరణను పొందుతున్నారు. ఇంతకీ వాళ్ళు ఎవరో ఒకసారి మనం తెలుసుకుందాం…

    సంతోష్ శ్రీనివాస్
    కందిరీగ సినిమాతో ఈయన దర్శకుడిగా మారి మంచి విజయాన్ని అందుకున్నాడు. అప్పటినుంచి ఇప్పటివరకు వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇందులో ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో రభస అనే సినిమా చేసి ఆవరేజ్ సక్సెస్ ని అందుకున్నాడు. మరి మొత్తానికైతే ఆయన సినిమా మీద పెట్టే ఎఫర్ట్స్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయని విమర్శకులు కూడా ప్రశంసించడం విశేషం… ఇక సంతోష్ శ్రీనివాస్ ఖాతర్నాక్, టక్కరి, రెయిన్ బో లాంటి చిత్రాలకి సినిమాటోగ్రాఫర్ గా పనిచేశాడు.

    కార్తీక్ ఘట్టమనేని

    కార్తికేయ సినిమాతో సినిమాటోగ్రాఫర్ గా పరిచయమైన కార్తీక్ ఘట్టమనేని ఆ తర్వాత సూర్య వర్సెస్ సూర్య సినిమాను డైరెక్టు చేశాడు. ఇక ఆ సినిమా అనుకున్న విధంగా సక్సెస్ కాకపోవడంతో మళ్లీ సినిమాటోగ్రాఫర్ గా రాణిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటికే ఆయన రవితేజ లాంటి స్టార్ హీరోతో ఈగల్ అనే సినిమాని కూడా తీశాడు. మరి ఈ సినిమా అనుకున్న విజయాన్ని సాధించకపోవడంతో ఇప్పుడు తేజ సజ్జా తో మిరాయ్ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు…

    శివ

    ఇక తమిళ్ దర్శకుడు అయిన శివ శౌర్యం, శంఖం, దరువు లాంటి సినిమాలను డైరెక్ట్ చేశాడు. తమిళంలో అజిత్ తో వరుసగా నాలుగు సినిమాలు చేసి సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు… ఇక ఈయన మొదట తెలుగులో నేనున్నాను, బాస్, మనసు మాట వినదు, గౌతమ్ ఎస్ ఎస్ సి లాంటి సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేశాడు…

    ఇక వీళ్లే కాకుండా మరికొంతమంది సినిమాటోగ్రాఫర్లు కూడా దర్శకులుగా మారి సక్సెస్ లను సాధించిన వారు ఉండడం విశేషం…