https://oktelugu.com/

Dulquer salmaan & karthi : తెలుగు హీరోలతో పోటీ పడుతున్న ఇతర భాషల హీరోలు వీళ్లే…

సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం కొత్త కథలు వస్తున్నాయి. నిజానికి యంగ్ హీరోలు మంచి కథలతో సినిమాలు చేస్తూ సక్సెస్ లను సాధిస్తున్నారు. ఇక స్టార్ హీరోలు సైతం వాళ్ళ ఇమేజ్ ని బేస్ చేసుకొని ఉండే కథలతో సినిమాలు చేసి సూపర్ సక్సెస్ లను అందుకుంటున్నారు. ఇక ఏది ఏమైన కూడా కొత్త కథలకు సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి క్రేజ్ అయితే దక్కుతుందనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : October 23, 2024 / 02:28 PM IST

    These are the heroes of other languages ​​competing with Telugu heroes.

    Follow us on

    dulquer & karthi :  తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి క్రమంలోనే ఇతర భాషల హీరోలు కూడా మన తెలుగు ఇండస్ట్రీలో వాళ్ళ సత్తా చాటుకోవాలనే ఉద్దేశ్యంతో వరుస సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. దానివల్ల  ఆ సినిమాలు బాగుంటే తెలుగు ప్రేక్షకులు వాటిని సక్సెస్ చేస్తున్నారు. లేకపోతే మాత్రం డిజాస్టర్ గా మిగిలిపోతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలోనే మన తెలుగు సినిమాలకి ఉన్న క్రేజ్ ఇతర భాషల సినిమాలకి రావడం లేదు. ఇక కొంతమంది యంగ్ హీరోలు మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ తెలుగు మార్కెట్ ని కూడా కొల్లగొడుతున్నారు. నిజానికి తమిళ్ ఇండస్ట్రీలో ఉన్న కార్తీ వరుస సినిమాలతో తెలుగు ఇండస్ట్రీ మీద దండయాత్ర చేస్తున్నప్పటికీ రీసెంట్ గా అతనికి ‘సత్యం సుందరం’ సినిమాతో మంచి విజయం అయితే దక్కింది.
    ఇక ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న దుల్కర్ సల్మాన్ తెలుగు, తమిళ్, మలయాళం అనే తేడా లేకుండా అన్ని భాషల్లో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఆయన లక్కీ భాస్కర్ అనే పేరుతో ఈనెల 31 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది.
    ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ పైనే కన్నేసారు. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ బాలీవుడ్ ఇండస్ట్రీని మించిపోయి ఇండియాలోనే నెంబర్ వన్ ఇండస్ట్రీగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ మంచి మార్కెట్ క్రియేట్ అయితే వాళ్లకి మంచి గుర్తింపు రావడమే కాకుండా రెమ్యూనరేషన్ రూపం లో కూడా భారీ మొత్తంలో డబ్బులను అందుకోవచ్చనే ఉద్దేశ్యంతో వాళ్ళు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇది ఏమైనా కూడా మన హీరోలు వరస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి.
    మరి మన హీరోలని ఢీకొట్టే విధంగా వాళ్ళు సినిమాలు చేస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మన హీరోలతో పోటీపడే సత్తా ఇతర భాషల హీరోలకు లేదనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే మన హీరోల వల్లే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అనేది ముందుకు సాగుతుందనేది వాస్తవం… కాబట్టి మన హీరోల సినిమాలను ఆచితూచి ముందుకు తీసుకెళ్తూ సక్సెస్ ఫుల్ గా నిలుపుతున్నారు…