https://oktelugu.com/

Avesham : ఆవేశం సినిమాను రీమేక్ చేస్తున్న స్టార్ హీరో…వర్కౌట్ అవుతుందా..?

ఒక లాంగ్వేజ్ లో సినిమా సక్సెస్ అయితే ఆ సినిమాని ఇతర లాంగ్వేజ్ లో కూడా రీమేక్ చేయాలని చూస్తుంటారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు వస్తున్నప్పటికి కొన్ని రీజనల్ సినిమాలని మరొక లాంగ్వేజ్ లో రీమేక్ చేయాలని చూస్తున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : November 6, 2024 / 10:43 AM IST

    The star hero who is remaking the movie Avesham...will he get a workout..?

    Follow us on

    Avesham : మలయాళం సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఫాహద్ ఫజిల్ వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఎలాంటి పాత్రనైనా సరే ఈజీగా చేయగలిగే నటులలో ఫాహాద్ ఫజిల్ ఒకరు. ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడంలో ఆయన చాలా వరకు కష్టపడ్డాడు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఆయన ఆవేశం అనే ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మలయాళం లో సక్సెస్ అయింది. అలాగే ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అయి ఇక్కడ కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని కొంతమంది ప్రొడ్యూసర్లు ఆసక్తి చూపిస్తున్నారు. దానికోసం మొదట ఈ సినిమాలో బాలయ్య బాబుని హీరోగా అనుకున్నప్పటికి అది అంత పెద్దగా వర్కౌట్ కాలేదు. బాలయ్య ఆ క్యారెక్టర్ నేను చేయను అని చెప్పడంతో ఇప్పుడు రవితేజ తో ఆ సినిమాను చేయించాలని చాలామంది ఆరాటపడుతున్నారు. మరి మొత్తానికైతే రవితేజ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ప్రస్తుతం రవితేజ తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇంతకుముందు ఆయనకు వరుసగా కొన్ని ప్లాప్ లు వచ్చినప్పటికి ఎప్పటికప్పుడు ఆయన సక్సెస్ లను ఇస్తూ తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు కొన్ని సెట్స్ మీదనే ఉన్నాయి. ఆ సినిమాలు పూర్తయిన తర్వాత ఆవేశం సినిమా రీమేక్ లో రవితేజ నటించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

    ఇక ఈ సినిమాని ఎవరు డైరెక్టు చేయబోతున్నారనే విషయాలు స్పష్టంగా తెలియనప్పటికి తొందర్లోనే ఈ విషయాలకు సంబంధించిన వివరణ ఇచ్చేందుకు సినిమా యూనిట్ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో రవితేజ తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు.

    ఇక మొత్తానికైతే ఈ సినిమాలో ఫాహాద్ ఫజిల్ ను మైమరిపించేలా రవితేజ నటించి మెప్పిస్తాడా? లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక నిజానికి రీమేక్ సినిమా చేయడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఆల్రెడీ ఒక లాంగ్వేజ్ లో ఒక హీరో చేసిన క్యారెక్టర్ ని మరొక హీరో చేసి మెప్పించడం అనేది కత్తి మీద సాము లాంటిది. వాళ్ళు ఆల్రెడీ ఒక డెప్త్ ను క్రియేట్ చేసి ఉంటారు.

    ఇక దానికి మించి మనం సినిమా చేస్తేనే ఆ సినిమా ఆడుతుంది. అలాగే ఆ హీరోకి కూడా మంచి పేరు వస్తుంది. కానీ అలా కాకుండా అందులో హీరో నటన ఏమాత్రం తగ్గిన కూడా హీరోకి బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి…