Game Changer : శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా వస్తున్న ‘గేమ్ చేంజర్’ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. అయితే ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని ఈనెల తొమ్మిదొవ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే దానికోసం సినిమా యూనిట్ ఒక వినూత్న పద్ధతిని పాటిస్తున్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. అదేంటి అంటే ఈ సినిమా టీజర్ ని 11 చోట్ల నుంచి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా విషయంలో రామ్ చరణ్ గానీ శంకర్ గానీ ఎక్కడ తగ్గడం లేదు. ప్రతి విషయాన్ని భారీగా పబ్లిసిటీ చేసి సినిమా మీద భారీ హైప్ క్రియేట్ చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం హైదరాబాదు – సుదర్శన్, వైజాగ్ – సంగం శరత్,రాజమండ్రి – శివజ్యోతి, విజయవాడ -శైలజ, కర్నూల్ – వి మెగా, నెల్లూరు – ఎస్ 2 థియేటర్, బెంగుళూర్ – ఊర్వశి థియేటర్, అనంతపూర్ – త్రివేణి,తిరుపతి -పీజీఆర్, ఖమ్మం – ఎస్వీసి థియేటర్లలో టీజర్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు…ఇక ఇప్పటివరకు రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్లకి గాని, సాంగ్స్ కి గాని విపరీతమైన హైప్ రావడంతో ఆ హైప్ ని ఇంకా భారీగా వాడుకోవడానికే ఈ సినిమా టీజర్ ని భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ తన మేనియాతో మరోసారి ఈ సినిమాను విజయ తీరాలకు చేర్చాలనే ప్రణాళికలు చేస్తున్నాడు. ఇక తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న రామ్ చరణ్ ఈ సినిమాతో మాత్రం భారీ పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది.
ఇక శంకర్ కూడా ఈ సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. లేకపోతే మాత్రం ఆయన మార్కెట్ భారీగా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఏది ఏమైనా అటు రామ్ చరణ్ ఇటు శంకర్ ఇద్దరు కూడా వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలంటే మాత్రం ఈ సినిమాతో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించాల్సిందే…