https://oktelugu.com/

Allu Arjun : పుష్ప నేను చేయాల్సిందంటూ అల్లు అర్జున్ పై ఆ స్టార్ హీరో సంచలన కామెంట్స్!

పుష్ప మూవీ అల్లు అర్జున్ కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం. ఏకంగా పాన్ ఇండియా స్టార్ హోదా తెచ్చిపెట్టింది. నార్త్ ఆడియన్స్ కి అల్లు అర్జున్ ని దగ్గర చేసింది. అయితే పుష్ప కథను అల్లు అర్జున్ కంటే ముందు కొందరు హీరోలకు సుకుమార్ వినిపించాడు. వారు రిజెక్ట్ చేశాడు. కాగా ఓ స్టార్ హీరో పుష్ప మూవీ నేను చేయాల్సింది అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

Written By:
  • S Reddy
  • , Updated On : October 26, 2024 1:49 pm
    That star hero's sensational comments on Allu Arjun saying Pushpa I should do it!

    That star hero's sensational comments on Allu Arjun saying Pushpa I should do it!

    Follow us on

    Allu Arjun : పుష్ప స్క్రిప్ట్ మొదట మహేష్ బాబు వద్దకు వెళ్ళింది. మహేష్ కి కథ నచ్చింది. కానీ అలాంటి రా అండ్ రస్టిక్ క్యారెక్టరైజేషన్ తనకు సెట్ కాదేమో అని మహేష్ బాబు భయపడ్డాడు. అందుకే పుష్ప చిత్రాన్ని మహేష్ బాబు చేయలేదు. అలాగే ఈ కథ షారుఖ్ ఖాన్ కూడా రిజెక్ట్ చేయడం విశేషం. ఆ విషయాన్ని ఆయన తాజాగా వెల్లడించాడు. పుష్ప మూవీ నేను చేయాల్సిందని ఆయన అన్నారు. 
     
    పఠాన్ ముందు వరకు షారుఖ్ ఖాన్ కెరీర్ ఒడిదుడుకులకు లోనైంది. దశాబ్దానికి పైగా ఆయనకు ఒక్క హిట్ లేదు. ఈ క్రమంలో ఆయన కొందరు సౌత్ దర్శకులతో కూడా పని చేయాలి అనుకున్నారు. పుష్ప స్క్రిప్ట్ షారుఖ్ వద్దకు కూడా వెళ్లిందట. సుకుమార్ ఆయన్ని సంప్రదించాడట. కానీ షారుఖ్ ఖాన్ ఎందుకో చేయలేదట. 
     
    పుష్ప చిత్రాన్ని నేను చేయాల్సింది. అయితే అల్లు అర్జున్ స్వాగ్ ని నేను మ్యాచ్ చేయలేనని షారుఖ్ ఖాన్ అన్నారు. అలాగే లాల్ సింగ్ చద్దా చిత్రం కూడా షారుఖ్ ఖాన్ చేయాల్సిందట. లాల్ సింగ్ చద్దా డిజాస్టర్ అయ్యింది. ఆ మూవీ అమీర్ ఖాన్ కూడా చేయాల్సింది కాదని షారుఖ్ ఖాన్ అన్నారు. చిత్ర పరిశ్రమలో ఒకరు చేయాల్సిన కథలు మరొక హీరోల వద్దకు వెళ్లడం సాధారణమే. 
     
    2021లో విడుదలైన పుష్ప వరల్డ్ వైడ్ రూ. 350 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక పుష్ప చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న పుష్ప 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఏకంగా రూ. 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. భారీ లాభాలు తెచ్చిపెట్టింది. పుష్ప 2 డిసెంబర్ 5న విడుదల చేస్తున్నారు. అల్లు అర్జున్ కి జంటగా రష్మిక మందాన నటిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు.