https://oktelugu.com/

Prabhas : ప్రభాస్ తో వరుస సినిమాలు సెట్ చేస్తున్న ఆ ప్రొడక్షన్ హౌజ్…కారణం ఏంటి..?

తెలుగు సినిమా ఇండస్ట్రీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన హీరోలలో ప్రభాస్ ఒకరు. బాహుబలి ముందు వరకు తెలుగు సినిమా అంటే కేవలం రెండు రాష్ట్రాలకే పరిమితమైపోయేది కానీ బాహుబలి తర్వాత పాన్ ఇండియా సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నెంబర్ వన్ గా గుర్తింపు పొందడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి...ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ప్రభాస్ స్థానదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు...అందుకే ఆయనకి పాన్ ఇండియా లో మంచి గుర్తింపు అయితే దక్కుతుంది...

Written By:
  • Gopi
  • , Updated On : November 7, 2024 / 09:16 AM IST

    That production house which is setting series of films with Prabhas...what is the reason..?

    Follow us on

    Prabhas : ప్రభాస్ లాంటి స్టార్ హీరో తమ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు అంటే చాలు ఇక ఆ సినిమా హిట్లు ప్లాప్ తో సంబంధం లేకుండా ఆ ప్రొడ్యూసర్ స్టార్ స్టార్ ప్రొడ్యూసర్ గా గుర్తింపును సంపాదించుకుంటాడనే విషయం మన అందరికి తెలిసిందే. నిజానికి ప్రభాస్ ఏ సినిమా చేసిన కూడా అందులో తనదైన మార్కు చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకే ఆయన ప్రొడక్షన్ హౌజ్ తో సంబంధం లేకుండా దర్శకుల ఎంపికలో మాత్రమే చాలా ఎక్కువ కేర్ తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాడు. అందుకే తన దగ్గరికి వచ్చిన ప్రొడ్యూసర్లందరితో ఏదో ఒక సినిమా చేయడానికి ఆయన ఆసక్తి చూపిస్తున్నప్పటికి దర్శకులను ఎంచుకోవడంలో మాత్రం ఆయన లైనప్ అనేది చాలా క్లియర్ గా ఉంటుంది.ఎవరైతే తనని ఎలివేట్ చేస్తూ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లగలిగే సత్తా ఉందని ప్రభాస్ అనుకుంటున్నాడో ఆ దర్శకులకు మాత్రమే తన సినిమాలో అవకాశాలను ఇస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి స్టార్ హీరో ప్రస్తుతం పాన్ ఇండియాని షేక్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే… ఇక ప్రభాస్ తన హోమ్ బ్యానర్ అయిన యూవీ క్రియేషన్స్ ఉన్నప్పటికి బయట ప్రొడ్యూసర్స్ కి కూడా డేట్స్ ని ఇస్తూ వాళ్లతో సినిమాలు చేయడానికి ఒప్పందాలను కుదుర్చుకుంటున్నాడు…

    ఇక అందులో భాగంగానే కన్నడ సినిమా ప్రొడక్షన్ హౌజ్ అయిన హోం బలే పిక్చర్స్ తో ఆయన ఇప్పటికే సలార్ సినిమా చేశాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు ‘సలార్ 2’ సినిమా రాబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి మొత్తానికైతే ఈ సినిమాలే కాకుండా హోంబలే ప్రొడక్షన్స్ తో మరొక సినిమా చేయడానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

    నిజానికి హోం బలే ప్రొడ్యూసర్స్ ప్రభాస్ ని టార్గెట్ చేస్తూ ఆయన డేట్స్ కోసమే విపరీతంగా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆయనతో సినిమా చేస్తే సినిమా యావరేజ్ గా ఆడిన కూడా భారీగా వసూళ్లను రాబట్టొచ్చనే ఉద్దేశ్యంలో వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తోంది.

    ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి స్టార్ హీరో తమదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగడమే కాకుండా పాన్ ఇండియాలో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది…