https://oktelugu.com/

NTR ,Ram Charan, Allu Arjun : ఎన్టీయార్ లో ఉన్న ఆ ఒక్క క్వాలిటీ రామ్ చరణ్, అల్లు అర్జున్ లో లేదా..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఏది ఏమైనా కూడా వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడంలో మొదటి నుంచి కూడా చాలా వరకు కసరత్తులు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల హవా కొనసాగుతుందనే చెప్పాలి. ఇప్పటికే పాన్ ఇండియాలో భారీ సక్సెస్ లను సాధించిన హీరోలు ఇక మీదట కూడా అదే రేంజ్ లో సక్సెస్ లను సాధించడానికి ముందుకు దూసుకెళ్తున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : October 26, 2024 / 01:56 PM IST

    That one quality in NTR is not in Ram Charan, Allu Arjun..?

    Follow us on

    NTR ,Ram Charan, Allu Arjun : తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి నందమూరి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇక ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలు కూడా భారీ సక్సెస్ లను సాధిస్తాయనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు. మరి ఈ క్రమంలోనే ఆయన లాంటి నటుడు ఇండస్ట్రీలో మరొకరు లేరు అంటూ చాలామంది చెబుతూ ఉంటారు. నిజానికి ఆయన డ్యాన్సులు వేయడంలో గాని, ఏ పాత్ర లో అయిన నటించడంలో గాని, సింగిల్ టేక్ లో డైలాగులు చెప్పడంలో కానీ ఆయన దిట్టా…ఇక జూనియర్ ఎన్టీఆర్ కి రామ్ చరణ్, అల్లు అర్జున్ ల నుంచి భారీ పోటీ అయితే ఎదురవుతూ ఉంటుంది. అయితే ఈ ముగ్గురు కూడా చాలా మంచిగా డాన్సలు కావడం విశేషం… ఇక వీళ్ళు మొదటి నుంచి కూడా డ్యాన్స్ లు బాగా వేస్తూ ప్రత్యేకతను సంతరించుకున్నారు. కానీ ఒక్క విషయంలో మాత్రం వీళ్ళు ఎన్టీఆర్ ని ఢీకొట్టలేకపోతున్నారు.
    అదేంటి అంటే ఆయన ఎంత పెద్ద డైలాగైన సరే సింగిల్ టేక్ లో చెప్పి మెప్పించగలిగే సత్తా ఉన్న నటుడు… మరి వీళ్ళిద్దరు ఆ విషయంలో కొంతవరకు వెనకంజా లో ఉన్నారనే చెప్పాలి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ పంథా మొదటి నుంచి కూడా వేరే స్టైల్ లో ఉంటుంది. ఇక ఎలాంటి ఆక్టివిటీ అయిన సరే చాలా సింపుల్ గా చేసేస్తూ రిహార్సల్స్ చేయకుండా సింగల్ టేక్ లో నటించి మెప్పించగలిగే నటన ఆయన సొంతం…
    అందుకే ఆయన స్టార్ హీరో రేంజ్ లో ముందుకు దూసుకెళ్తున్నాడు. సినిమాల సక్సెస్ పరంగా కూడా ప్రస్తుతం ఆయన టాప్ రేంజ్ లో ఉన్నాడు. ఇక ఇప్పటికే వరుసగా ఏడు సినిమాలతో విజయాలను అందుకున్న ఏకైక హీరోగా కూడా ఆయన వెలుగొందడం విశేషం… ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో ఒక పెను సంచలనం సృష్టిస్తున్నాయి.
    దాదాపు పది సంవత్సరాల నుంచి ఆయనకు ఒక్క ఫ్లాప్ సినిమా కూడా లేదంటే ఆయన స్టోరీ సెలక్షన్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు…ఇక ఏది ఏమైనా కూడా మన స్టార్ హీరోలందరు పాన్ ఇండియాలో సక్సెస్ లను సాధించడం అనేది ఇప్పుడు ఒక ఒక శుభ పరిణామం అనే చెప్పాలి…