https://oktelugu.com/

Tamil movie : ఓటిటి లో సత్తా చాటుతున్న తమిళ్ మూవీ…ఇంతకీ అది ఏ మూవీ…ఎక్కడ చూడవచ్చు అంటే..?

ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొత్త కథలకు ఎక్కువ ఆదరణ దక్కుతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లందరూ వరుస సినిమాలు చేస్తు సూపర్ సక్సెస్ లను సాధించడమే కాకుండా చిన్న కాన్సెప్ట్ లతో వచ్చే సినిమాలకు కూడా మంచి గిరాకీ అయితే దక్కుతుంది...

Written By:
  • Gopi
  • , Updated On : October 28, 2024 / 04:58 PM IST

    Tamil movie showing its potential in OTT...so which movie is it...where can you watch it..?

    Follow us on

    Tamil movie : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ కథలతో సినిమాలను చేస్తూ సక్సెస్ అందుకుంటారు. ముఖ్యంగా సక్సెస్ సాధించడానికి ఆయాదర్శకులు డిఫరెంట్ కథలతో పాటు మేకింగ్ మీద కూడా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఇక ఏది ఏమైనా కూడా వాళ్ళు సినిమాలను చేయడంలో పెట్టిన శ్రద్ధ మిగతా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు పెట్టడం లేదనే వార్తలైతే వినిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం తమిళ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన మారి సెల్వరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘వాలై ‘ సినిమా భారీ సక్సెస్ ని సాధించడమే కాకుండా ప్రేక్షకులందరి మన్ననలు పొందుతుంది. నిజానికైతే ఈ సినిమా థియేటర్ లో పెద్దగా సక్సెస్ ని సాధించనప్పటికి ఓటిటి లో మాత్రం భారీ రెస్పాన్స్ మూటగట్టుకుంటుంది. ఇక ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతున్న రోజు నుంచి ఇప్పటివరకు భారీ వ్యూయర్ షిప్ ను సంపాదించుకోవడమే కాకుండా ఆ సినిమా కోసం సెర్చ్ చేస్తున్న వారి సంఖ్య కూడా పెరిగిపోయిందనే చెప్పాలి. ఇక డిస్ట్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్  అవుతున్న ఈ సినిమా ను ఏజ్ గ్రూప్ తో సంబంధం లేకుండా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో ఒక ఇంటెన్స్ డ్రామా అనేది క్రియేట్ అయింది. మారి సెల్వరాజ్ గత సినిమాల్లో కూడా ఆయన డ్రామాని ఎక్కువగా ఎలివేట్ చేస్తూ సీన్స్ రాసుకున్నాడు. ఇక ఈ సినిమాలో కూడా అలాంటి ఒక డ్రామా ని ప్లే చేయడానికి ఆయన మొదటి నుంచి చివరి వరకు చాలా తీవ్రమైన ప్రయత్నం అయితే చేశాడు. ఇక వాళ్ల పర్ఫామెన్స్ ను బట్టి సినిమా అనేది నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయిందనే చెప్పాలి. ఇక ఆర్టిస్టులు కూడా వాళ్ళ పర్ఫామెన్స్ తో జీవించేశారు. నిజానికి ఈ సినిమాలో చిన్న పిల్లోడు చేసిన క్యారెక్టర్ అయితే అద్భుతంగా ఉందనే చెప్పాలి. మరి ఈ సినిమా పెద్ద పెద్ద సినిమాలకు సైతం పోటీనిస్తూ ఓటిటి ప్లాట్ ఫామ్ లో అత్యధిక వ్యూయర్ షిప్ ను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్ళడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు ఓటిటిలో ఏ తమిళ్ సినిమా దక్కించుకొని ఒక అరుదైన రికార్డును కూడా ఈ సినిమా దక్కించుకోబోతునే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక కొద్దిరోజుల్లోనే ఈ సినిమా మిలియన్లలో వ్యూస్ ని సంపాదించుకుంది. అలాంటి ఈ సినిమా కోసం ఎందుకు ఇతర భాషల్లో ఉన్న ఆడియన్స్ ఎదురు చూశారు. ఎందుకు ఈ సినిమాని చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు అనేది తెలియాలంటే మీరు కూడా ఈ సినిమాను తప్పకుండా చూడాల్సిందే…హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాని చూస్తూ మీ ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేయండి…