https://oktelugu.com/

Pushpa 2 : పుష్ప 2 ట్రైలర్ కి రంగం సిద్ధం చేసిన సుకుమార్… సరికొత్త రీతిలో డిజైన్ చేస్తున్నారట..? కారణం ఏంటి..

అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న 'పుష్ప 2' సినిమా మీద పాన్ ఇండియాలో మంచి ఆంచనాలైతే ఉన్నాయి. ఇక తెలుగు కంటే కూడా ఈ సినిమా మీద బాలీవుడ్ లో భారీ అంచనాలైతే ఉన్నాయి. మొదటి పార్ట్ బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అవ్వడం వల్లే ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ అయితే వచ్చాయి. ఇక అదే ఊపుతో ఈ సినిమాను కూడా బరిలోకి దింపబోతున్నట్టుగా తెలుస్తుంది... డిసెంబర్ 6వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం మనకు తెలిసిందే...

Written By:
  • Gopi
  • , Updated On : October 23, 2024 / 12:14 PM IST

    Sukumar, who prepared the scene for the trailer of Pushpa 2... is designing in a new way..? What is the reason..?

    Follow us on

    Pushpa 2 : పుష్ప 2 సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ప్రతి ఒక్కరిని అలరిస్తుందంటూ చాలా కాన్ఫిడెంట్ తో ఉన్నారు. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ రేంజ్ లో జరగడం అనేది ఈ సినిమా మీద భారీ అంచనాలను పెంచుతుంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ను నవంబర్ మొదటి వారంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా భారీ పెను ప్రభంజనాన్ని సృష్టిస్తుంది అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా ట్రైలర్ ని చాలా అద్భుతంగా మలచినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా రెగ్యూలర్ సినిమాల్లో ఎలాగైతే ట్రైలర్ ను వదులుతారో అలా కాకుండా పుష్ప 2 ట్రైలర్ లో హీరో కంటే విలన్ ని హైలైట్ చేసి చూపించబోతున్నట్టుగా తెలుస్తోంది. దాని ద్వారా ప్రేక్షకుల్లో విలన్ క్యారెక్టర్ ఏంటో అనే దాని మీద ఒక క్లారిటీ అయితే వస్తుంది. అయితే ఇందులో ఫాహాద్ ఫజిల్, సునీల్ ఇద్దరు విలన్స్ గా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
    ఇక వీళ్లతో పాటు మరొక కొత్త విలన్ కూడా ఇందులో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది. మొదటి పార్ట్ లో వీళ్ళిద్దరూ విలనిజాన్ని బాగా పండించారు. ఇక ఈ పార్ట్ లో కొత్త విలన్ తో అల్లు అర్జున్ ఢీకొనబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఆ విలన్ ఎవరు అనేది ట్రైలర్ రిలీజ్ అయితే గాని స్పష్టత రాదని ఈ సినిమా మేకర్స్ అయితే చెబుతున్నారు.
    నిజానికైతే అల్లు అర్జున్ పుష్ప సినిమాతో నేషనల్ అవార్డుని అందుకున్నాడు. ఇక ఈ సినిమాతో అంతకు మించిన అవార్డుని అందుకోవాలనే ఉద్దేశ్యంతో తను ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా పుష్ప 2 సినిమా సక్సెస్ అనేది అల్లు అర్జున్ కి చాలా కీలకంగా మారబోతుందనే చెప్పాలి.
    ఇప్పటికే వీళ్ళ కంటే వెనకాల వచ్చిన వాళ్ళు కూడా పాన్ ఇండియాలో సత్తాను చాటుతుంటే వీళ్ళు మాత్రం ఇంకా భారీ సక్సెస్ ని సాధించడంలో తడబడుతున్నారు. కాబట్టి ఈ సినిమాతో వెయ్యి కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…