https://oktelugu.com/

Srilila, Jati Ratnala heroine : జాతిరత్నాలు హీరోయిన్ పై శ్రీలీల ఊహించని కామెంట్స్, అందరూ షాక్!

జాతిరత్నాలు మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది ఫరియా అబ్దుల్లా. ఈ హైదరాబాద్ భామపై శ్రీలీల చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తోటి హీరోయిన్ ని శ్రీలీల ఏమన్నారో చూద్దాం.

Written By:
  • S Reddy
  • , Updated On : October 26, 2024 / 02:57 PM IST

    Srilila's unexpected comments on Jati Ratnala heroine, everyone is shocked!

    Follow us on

    Srilila, Jati Ratnala heroine : యంగ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా చాలా టాలెంటెడ్. అయితే విజయాలు దక్కకపోవడం వలన రేసులో వెనుకబడింది. 2021లో జాతిరత్నాలు చిత్రంతో ఫరియా అబ్దుల్లా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అందుకుంది. దర్శకుడు అనుదీప్ అవుట్ అండ్ అవుట్ కామెడీ డ్రామాగా జాతిరత్నాలు చిత్రాన్ని తెరకెక్కించాడు. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు చేశారు. ఈ మూవీ విజయంతో ఫరియా అబ్దుల్లాకు మంచి పేరొచ్చింది. అయితే చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. 
     
    కనీసం టైర్ టు హీరోల పక్కన హీరోయిన్ గా ఆఫర్స్ రాలేదు. సంతోష్ శోభన్, అల్లరి నరేష్ చిత్రాల్లో ఆమె ప్రధాన హీరోయిన్ గా చేసింది. రవితేజ నటించిన రావణాసురలో హీరోయిన్ కాని హీరోయిన్ పాత్ర ఆమెది. ఆ మూవీ డిజాస్టర్ కావడం ఫరియా కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపింది. తాజాగా ఆమె మత్తువదలరా 2లో హీరోయిన్ గా నటించింది. కీరవాణి కుమారుల్లో ఒకరైన శ్రీసింహ ఈ చిత్రంలో హీరో. కమెడియన్ సత్య మరో కీలక రోల్ చేశాడు. 
     
    ఈ మూవీ ఇటీవల విడుదలైంది. ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే ఈ మూవీ వలన ఫరియా లో ఉన్న కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఓ పాటను ఆమె స్వయంగా రాసి, పాడారు. ఫరియా మంచి డాన్సర్ అన్న విషయం అందరికీ తెలుసు. ఆమెలో సింగర్, రైటర్ కూడా ఉన్నారన్న విషయం తెలిసింది. ‘డ్రామా నక్కో మామ’ అనే ఓ సాంగ్ కి రచయితగా, సింగర్ గా ఆమె పని చేశారు. 
     
    ఫరియా టాలెంట్ కి ఫిదా అయిన మరో యంగ్ హీరోయిన్ శ్రీలీల ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఫరియా గాత్రం, కొరియోగ్రఫీపై ప్రశంసలు కురిపించింది. ఇంస్టాగ్రామ్ లో శ్రీలీల.. డ్రామా నక్కో మామ.. సాంగ్ ని ఉద్దేశిస్తూ ‘ఆల్ ఇన్ వన్ గర్ల్’ అని కామెంట్ చేసింది. ఫరియా అబ్దుల్లా మల్టీ టాలెంటెడ్ అని శ్రీలీల కామెంట్ ద్వారా తెలియజేసింది.  
     
    ఇక శ్రీలీల కామెంట్ పై ఫరియా స్పందించింది. లవ్ యు అని రిప్లై ఇచ్చింది. ఈ యంగ్ హీరోయిన్స్ మధ్య ఉన్న బాండింగ్ ని ప్రేక్షకులు కొనియాడుతున్నారు. మరోవైపు శ్రీలీల ఫుల్ బిజీగా ఉన్నారు. ఆమె నితిన్ కి జంటగా రాబిన్ హుడ్ మూవీ చేస్తుంది. అలాగే VD 12, ఉస్తాద్ భగత్ సింగ్, రవితేజ 75వ చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటిస్తుంది.