https://oktelugu.com/

Anirudh : అనిరుధ్ లైనప్ లో చేరిపోతున్న మరికొన్ని తెలుగు సినిమాలు…ఆయనకి ఎందుకంత క్రేజ్ పెరుగుతుంది…

తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నప్పటికి సరైన మ్యూజిక్ అయితే రావడం లేదని చాలామంది ప్రేక్షకులు సినిమా మ్యూజిక్ విషయంలో నిరుత్సాహపడుతున్నారు. ఒకప్పుడు వచ్చిన మ్యూజిక్ ఇప్పుడు రావడం లేదు. మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర నుంచి ఆ మ్యూజిక్ ను తీసుకోవడంలో దర్శకులు ఫెయిలవుతున్నారా అనేది కూడా తెలియాల్సి ఉంది...

Written By:
  • Gopi
  • , Updated On : October 26, 2024 / 02:34 PM IST

    Some more Telugu movies joining Anirudh's line-up...why is he getting more craze...

    Follow us on

    Anirudh : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న  మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్…ఇక రీసెంట్ గా దేవర సినిమాతో తెలుగులో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించాడు. అనిరుధ్ ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా తన మ్యూజిక్ తో ప్రేక్షకులందరిలో ఒక మ్యాజిక్ క్రియేట్ చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే ఆయన తమిళ్ సినిమాలకు మ్యూజిక్ ని అందిస్తున్నప్పటికి ఇప్పుడు వరుసగా తెలుగు సినిమాలకి కూడా కమిట్ అవుతూ తనదైన రీతిలో గుర్తింపును తెచ్చుకుంటున్నాడు. ఇక ఇప్పటికే తెలుగులో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు అయిన కీరవాణి,దేవిశ్రీ ప్రసాద్, తమన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్లకు సైతం చెమటలు పట్టించేలా మ్యూజిక్ ని అందించడం విశేషం… ఇక తనదైన రీతిలో సినిమాలను చేస్తున్న అనిరుధ్ ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక అందులో భాగంగానే శ్రీకాంత్ ఓదెల, నాని కాంబినేషన్ లో వస్తున్న సినిమాకి కూడా  మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక వాటితో పాటుగా మరికొన్ని సినిమాలకు కూడా తన మ్యూజిక్ అందించడానికి సిద్ధమవుతున్నాడు. మరి ఇలాంటి క్రమంలో ఆయన చేస్తున్న మ్యూజిక్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నాడనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది.
    ఇక పాటల విషయంలో అనిరుధ్ తెలుగులో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కానీ దేవర సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం అద్భుతంగా ఉండడంతో ఆయనకు తెలుగులో భారీ అవకాశాలైతే వస్తున్నాయి. ఇక ప్రస్తుతానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా సరైన మ్యూజిక్  డైరెక్టర్ లేడనే చెప్పాలి. దేవిశ్రీప్రసాద్ ఉన్నప్పటికీ ఆయన పెద్ద సినిమాలకి మాత్రమే పరిమితమవుతున్నాడు. చిన్న సినిమాలను పట్టించుకోవడం లేదు.
    అలాగే తమన్ చాలా సినిమాలకు మ్యూజిక్ ఇస్తున్నప్పటికి మ్యూజిక్ మొత్తం రిపీటెడ్ గా ఉండటమే కాకుండా, కాపీ మ్యూజిక్ అంటూ సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతుంది. ఇలాంటి సందర్బంలో  సినిమా మ్యూజిక్ ని చాలా బాగా సెట్ చేయగలరనే ఉద్దేశ్యంతో అతన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది…ఏది ఏమైనా కూడా తనను తాను తెలుగులో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలంటే మాత్రం ఇప్పుడు వచ్చే తెలుగు సినిమాలతో భారీ సక్సెస్ లను సాధించాలి. అలాగే తన మ్యూజిక్ లో కొత్తదనాన్ని కూడా చూపించాల్సిన అవసరమైతే ఉంది… లేకపోతే మాత్రం ఆయనకు తెలుగులో అంత పెద్దగా క్రేజ్  దక్కకపోవచ్చు.
    ప్రస్తుతం వస్తున్న అవకాశాలు కూడా ఆ తర్వాత రాకపోవచ్చు…ముఖ్యంగా ఆయనకు ఎక్కువ క్రేజ్ రావడానికి గల కారణం ఏంటి అంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో అని చాలా జాగ్రత్తలు తీసుకొని మరి ఆ సీన్ ని హైప్ చేయడంలో చాలా ఎఫర్ట్ పెట్టి మరి మ్యూజిక్ అందిస్తాడు. అందువల్లే ఆయనకు ఇండియాలో చాలా మంచి క్రేజ్ అయితే దక్కింది….