https://oktelugu.com/

Sandeep Reddy : సందీప్ రెడ్డి వంగ కి ఎందుకంత ఆటిట్యూడ్…దాని వల్ల ఆయన ఏం సాధించాడు..?

సినిమా అంటే ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. వీలైతే సినిమాలు చూడడానికే కాకుండా సినిమాలో నటించడానికి కూడా ప్రతి ఒక్కరూ అసక్తి చూపిస్తారు. అయితే వాళ్లకున్న బాధ్యతలు వాళ్లని సినిమా ఇండస్ట్రీ లోకి రాకుండా అణచివేస్తూ ఉంటాయి. కానీ ఒక్కసారి మాత్రం ఇండస్ట్రీ కి వచ్చి సక్సెస్ సాధించడం చూశారంటే మాత్రం ఆ సక్సెస్ ఫార్ములాని వదలకుండా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : November 5, 2024 / 05:02 PM IST

    Sandeep Reddy's attitude towards Vanga...what did he achieve because of it..?

    Follow us on

    Sandeep Reddy : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ…అప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న మూస ధోరణి ఫార్ములని పటాపంచలు చేస్తూ ఆయన చేసిన అర్జున్ రెడ్డి సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. నిజానికి ఆయన చేసిన సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఒక పెను సంచలనంగా మారిందనే చెప్పాలి. ఇక ఆ తర్వాత ఈ సినిమానే బాలీవుడ్ లో ‘కబీర్ సింగ్’ పేరుతో షాహిద్ కపూర్ తో రీమేక్ చేశాడు. అక్కడ కూడా భారీ విజయాన్ని సాధించింది. ఆ రెండు సినిమాలు సూపర్ సక్సెస్ ని సాధించిన తర్వాత రన్బీర్ కపూర్ ను హీరోగా పెట్టి చేసిన అనిమల్ సినిమా గత సంవత్సరం ఎండింగ్ లో వచ్చి భార్య రికార్డులను కొల్లగొట్టిందనే చెప్పాలి. ఇక ఈ సినిమా లాంగ్ రన్ లో 900 కోట్లను రాబట్టి సందీప్ రెడ్డివంగా స్టామినా ఏంటో మరొకసారి ప్రూవ్ చేసిందనే చెప్పాలి. నిజానికి సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్ చాలా ఆటిట్యూడ్ తో ఉంటాడని అందరూ అనుకుంటారు. కానీ ఆయనకి పెద్దగా ఆటిట్యూడ్ అయితే ఏమీ ఉండదు. ప్రెస్ మీట్ సమయంలో రిపోర్టర్లు అడిగే ప్రశ్నలు అతన్ని కొంతవరకు ఇబ్బంది పెట్టడం వల్ల ఆయన స్ట్రైయిట్ ఫార్వర్డ్ గా ఆన్సర్ ఇస్తూ ఉంటాడు. దానివల్ల అతనికి ఆటిట్యూడ్ ఎక్కువ అని చాలా మంది అనుకుంటారు.

    నిజానికైతే సందీప్ రెడ్డి వంగ చాలా కూల్ గా ఉంటూ తన సినిమాకు సంబంధించిన ఆలోచనలు చేసుకుంటూ ఉంటాడు. అలాంటి సందీప్ రెడ్డి వంగ ను ఎవరైనా గెలికితే మాత్రం ఆయన తన ఆటిట్యూడ్ ను చూపించడనే కాకుండా వాళ్ళ మీద చాలా వైల్డ్ గా విరుచుకుపడుతూ ఉంటాడు.

    మరి అనిమల్ సినిమా సమయం లో చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలు అతన్ని విమర్శించారు. అయినప్పటికి ఆయన కొంతమందికి తన స్టైల్ లో సమాధానం చెప్పాడు. మరి ఇంకొంతమందికి సమాధానం చెప్పిన వేస్ట్ అని వదిలేశాడు. ఇక ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి కి ఒక సెపరేట్ స్టైల్ అనేది ఉంది. ఆ స్టైల్ ఒక యూనిక్ వేలో ఉండటంవల్ల దాన్ని పట్టుకోవడం ఎవరి వల్ల కావడం లేదు.

    అలాగే ఆయన చేస్తేనే ఆ సినిమాలకు అంత మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీ వసూళ్లను రాబడుతూ ఉండటం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి…