https://oktelugu.com/

Sandeep Reddy vanga : సందీప్ రెడ్డి వంగ కి అల్లు అర్జున్, ఎన్టీయార్ చేసిన ఆ రెండు సినిమాల టైటిల్స్ అంటే చాలా ఇష్టమట…

సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఫ్యామిలీ సినిమాలు వస్తుండేవి. ఇక అందరూ ఆ సినిమాలను చూసి హిట్టు చేసేవారు. కానీ ఆ తర్వాత కాలం మారుతూ వస్తుంది. కాబట్టి ఇప్పుడు చాలావరకు వైల్డ్ కంటెంట్ తో బోల్డ్ సినిమాలు రావడం మొదలయ్యాయి. ఇక అందులో భాగంగానే ఇప్పుడున్న యూత్ ఆ సినిమాలన్నింటిని చూస్తూ వాటిని సూపర్ సక్సెస్ గా నిలుపుతున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : November 1, 2024 / 02:12 PM IST

    Sandeep Reddy Vanga ki Allu Arjun and NTR are the titles of those two movies that I like very much...

    Follow us on

    Sandeep Reddy vanga : అర్జున్ రెడ్డి సినిమా చేసి బోల్డ్ కంటెంట్ తో కూడా సూపర్ హిట్ కొట్టచ్చని నిరూపించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ…ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ చాలా కొత్తగా కనిపించబోతున్నట్టుగా కూడా వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక తన గత చిత్రం ఆయన అనిమల్ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్న ఆయన ఇప్పుడు తనదైన రీతిలో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇదిలా ఉంటే ఆయనలాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పెను సంచలనాలను సృష్టించి ఆ తర్వాత పాన్ ఇండియాలో తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్నాడు. ఆయన సినిమాలు బోల్డ్ గా ఉండటమే కాకుండా టైటిల్స్ కూడా చాలా వైల్డ్ గా ఉంటాయి. ఇక ఇదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగని అడిగితే తన సినిమాను బట్టి టైటిల్స్ పెడుతుంటానని చెప్పాడు. కానీ తన టైటిల్స్ కంటే కూడా ఆయనకి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ అనే టైటిల్ అంటే చాలా ఇష్టమని చెప్పాడు. ఎందుకంటే ఆ టైటిల్లో ఒక పవర్ ఉందని అలాంటి టైటిల్స్ ఎలా పెట్టాలని అనిపించిందో త్రివిక్రమ్ గారికి ఆ టైటిల్ ఎలా స్ట్రైక్ అయిందో ఆలోచిస్తేనే నాకు గూజ్ బంప్స్ వస్తున్నాయని చెప్పడం విశేషం…

    ఇక దాంతో పాటుగా అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘అలా వైకుంఠపురం లో’ సినిమా టైటిల్ కూడా చాలా బాగుంటుందని చెప్పాడు. ఇక మొత్తానికైతే త్రివిక్రమ్ డైరెక్షన్ కే కాకుండా ఆయన టైటిల్స్ కి కూడా సందీప్ రెడ్డివంగ ఫ్యాన్ అయిపోయాడనే చెప్పాలి…

    ఇక అదే రీతిలో తన సినిమాకి టైటిల్స్ ని పెడదామని ప్రయత్నం చేసినప్పటికి ఆ టైటిల్స్ తన సినిమాకి సెట్ అవ్వని ఆయన చెప్పడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో చేస్తున్న సినిమాతో భారీ ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నాడు. మరి ఈ సినిమా కూడా బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కుతుండడం వల్ల ప్రభాస్ అభిమానులు కొంతవరకు ఈ సినిమా మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    అయినప్పటికి సందీప్ మాత్రం ఈ సినిమాతో సూపర్ సక్సెస్ కొడుతున్నాం అంటూ వాళ్ళందరికి ఒక మంచి భరోసాని ఇస్తున్నాడు. తను ప్రభాస్ ని ఎలా చూపించాలి అనుకున్నాడో అలా చూపిస్తానని ఈ సినిమా ఇండస్ట్రీ హిట్టు కొడుతుందని కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నాడు. చూడాలి మరి ఈ సినిమాతో సందీప్ రెడ్డి వంగ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది…