Rakul Preet Singh: పెళ్లి తర్వాత కూడా హాట్ పిక్స్ ను షేర్ చేస్తున్న స్టార్ హీరోయిన్…
ఆమెకి టాలీవుడ్, బాలీవుడ్ లో అవకాశాలు లేకపోవడం తో ఆమె ఈ సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీన గోవాలో బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన జాకీ బాగ్నాని ని పెళ్లి చేసుకుంది.
Written By:
Gopi , Updated On : April 25, 2024 1:58 pm
1 / 4
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఒక వెలుగు వెలిగారు. ఆ తర్వాత ఇండస్ట్రీ లో అవకాశాలు లేక మళ్ళీ ఫెడౌట్ అయిపోయిన హీరోయిన్లు కూడా చాలా మంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రకుల్ ప్రీతిసింగ్ ఆ సినిమా సక్సెస్ తో ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే మొదట బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఈ ముద్దుగుమ్మ అక్కడ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో తెలుగు తెరకు పరిచయం అయింది. Photo: Instagram
2 / 4
ఇక ఇక్కడ వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వచ్చింది. ఈమె చేసిన సినిమాలు ఒక దశలో భారీగా ఫ్లాపులు మూటగట్టుకోవడంతో ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలైతే రాలేదు. ఇక దాంతో ఆమె బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించినప్పటికీ అక్కడ కూడా ఆమెకు పెద్దగా నేమైతే రాలేదు. ఇక దానికి తోడుగా డ్రగ్స్ కేసుల్లో కూడా ఆమె పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉండటంతో ఆమె తెలుగు సినిమా ఇండస్ట్రీని వదిలి బాలివుడ్ కి వెళ్ళిపోయింది. Photo: Instagram
3 / 4
ఇక ఆమెకి టాలీవుడ్, బాలీవుడ్ లో అవకాశాలు లేకపోవడం తో ఆమె ఈ సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీన గోవాలో బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన జాకీ బాగ్నాని ని పెళ్లి చేసుకుంది. ఇక తను పెళ్లి తర్వాత తన ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తుందని అందరు అనుకున్నారు. కానీ ఇప్పుడు అందరికీ షాకిస్తూ ఆమెకి సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో ఆమె సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే తన హాట్ హాట్ పిక్స్ ని సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తూ తన ఫ్యాన్స్ తో పాటు, ప్రేక్షకులందరిలో హీట్ పుట్టిస్తుందనే చెప్పాలి. Photo: Instagram
4 / 4
ఇక ఈ ఫొటోస్ ని చూసిన కొంతమంది అభిమానులు పెళ్లి తర్వాత ఇలాంటి హాట్ ఫొటోస్ దిగడం ఎందుకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం ఆమె అందం పెళ్లి తర్వాత కూడా తరిగిపోకుండా అలాగే ఉంది అంటూ పొగడ్తల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఇక ఇంకొందరైతే మళ్లీ సినిమాల్లో అవకాశాలు రావడం కోసమే తను ఇలాంటి హాట్ ఫొటోస్ ని షేర్ చేస్తుందా అనే అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక మొత్తానికైతే పెళ్లి తర్వాత కూడా ఈ అమ్మడు తన హవాని కొనసాగిస్తుందనే చెప్పాలి... Photo: Instagram