https://oktelugu.com/

Rajinikanth : రజినీకాంత్ జైలర్ 2 సినిమాలో కనిపించనున్న తెలుగు స్టార్ హీరో..

సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మంచి కథలను ఎంచుకొని సినిమాలుగా చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే వారు చేస్తున్న ప్రతి సినిమా ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా ఉంటే ఆ సినిమా సక్సెస్ సాధిస్తుంది. లేకపోతే మాత్రం ఆ సినిమా ప్లాప్ లను మూటగట్టుకుంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు... ఇక ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకటైపోయింది. కాబట్టి ఏ సినిమా చేసిన కూడా అది పాన్ ఇండియా రిలీజ్ అవుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి...

Written By:
  • Gopi
  • , Updated On : November 7, 2024 / 09:22 AM IST

    Rajinikanth's Telugu star hero who will be seen in Jailer 2...

    Follow us on

    Rajinikanth : తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఇతర భాషల స్టార్ హీరోలు కూడా కన్నేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే మన సినిమాలను చూస్తూ చాలామంది వాళ్ళను వాళ్ళు స్టార్ హీరోలుగా మార్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నటులు చాలామంది ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే రజినీకాంత్ లాంటి నటుడు తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్నప్పటికి ఆయన సినిమాలు తెలుగులో కూడా డబ్ అవ్వడం వల్ల ఇక్కడ కూడా చాలా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా రజనీకాంత్ లాంటి హీరోను కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ మొదటి నుంచి ఆదరిస్తూ వచ్చింది. అందువల్లే ఆయనకి ఇక్కడ భారీ మార్కెట్ ఏర్పడడమే కాకుండా ఇక్కడ కూడా ఆయనకు భారీ ఓపెనింగ్స్ దక్కుతున్నాయి అంటే దానికి కారణం తెలుగు సినిమా ఇండస్ట్రీ లోని ప్రేక్షకులు అతన్ని ఆదరించడమే అంటూ చాలామంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…

    ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టామినా అనేది పెరిగిపోయింది. కాబట్టి ఏ ఇండస్ట్రీలో ఉన్న హీరోలు అయినా సరే వాళ్ళు చేసే సినిమాల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది నటులను వాళ్ళ సినిమాల్లో పెట్టుకుంటే ఆ సినిమాకు భారీ ప్రమోషన్ అవుతుందని ఉద్దేశ్యం తోనే వాళ్ళు మన తెలుగు సినిమా హీరోల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

    ఇక ఇప్పటికే రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో వస్తున్న కూలీ సినిమాలో నాగార్జున విలన్ గా చేస్తున్నాడు. ఇక దాంతో పాటుగా ‘జైలర్ 2’ సినిమాలో కూడా మరొక తెలుగు హీరో నటించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం జైలర్ 2 లో విక్టరీ వెంకటేష్ ఒక కీలకపాత్రలో నటించబోతున్నడట. ఇక ఇప్పటికే వెంకటేష్ చాలామంది హీరోలతో మల్టీ స్టారర్ సినిమాలను చేశాడు.

    మరి ఈ సినిమాలో వెంకటేష్ పాత్ర ఎలా ఉంటుంది ఆయన విలన్ గా చేస్తున్నాడా లేదంటే సపోర్టింగ్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది…