https://oktelugu.com/

Rajamouli & Mahesh Babu : ఏఐ కోర్స్ నేర్చుకోవడం లో బిజీగా ఉన్న రాజమౌళి…మహేష్ బాబు సినిమా లేటవ్వడానికి కారణం ఇదేనా..?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కొత్త కథలకు ఎక్కువ ఆదరణ లభిస్తుంది. ఇక భారీ స్కేల్లో విజువల్ వండర్ గా తెరకెక్కించే సినిమాలకు కూడా భారీ క్రేజ్ దక్కుతుంది. రాజమౌళి బాహుబలి సినిమాతో ఒక భారీ మ్యాజిక్ అయితే చేశాడు. దానివల్లే పాన్ ఇండియా ఇండస్ట్రీలో ఒక పెను సంచలనం అయితే ఏర్పడిందనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : October 26, 2024 / 09:04 AM IST

    Mahesh Babu

    Follow us on

    Rajamouli & Mahesh Babu : తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన దర్శకులలో రాజమౌళి ఒకరు. ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. అందుకే ఆయనను మించిన దర్శకుడు మరొకరు లేరు అనేంతల గుర్తింపును సంపాదించుకుంటూ తనను తాను స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకుంటున్నాడు. అయితే పాన్ ఇండియాలో ఇప్పుడు ఆయనను మించిన దర్శకుడు లేడు. ఇండియాలో టాప్ డైరెక్టర్  గా ప్రూవ్ చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు  హాలీవుడ్ లో కూడా తన సత్తా ఏంటో చూపించాలనే ప్రయత్నంతోనే పాన్ వరల్డ్ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఇక ప్రస్తుతం ఆయన మహేష్ బాబు హీరోగా ఒక పాన్ వరల్డ్ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక దాంతో భారీ సక్సెస్ ని సాధిస్తే మాత్రం ఆయన తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవడానికి అవకాశం అయితే ఉంది. అందుకే ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా తనకంటూ ఒక గొప్ప గుర్తింపును కూడా సంపాదించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
    ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా సంవత్సరం క్రితమే అనౌన్స్ మెంట్ ఇచ్చినప్పటికి ఇంకా సెట్స్ మీదకు వెళ్లకపోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ప్రస్తుతం రాజమౌళి ఏఐ కి సంబంధించిన కోర్స్ నేర్చుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక మహేష్ బాబు సినిమాలో పూర్తిగా ఏఐ టెక్నాలజీ ద్వారానే సినిమా మొత్తం డిజైన్ చేయబోతున్నట్టుగా వర్తలైతే వస్తున్నాయి.
    అందువల్లే రాజమౌళికి దానిమీద పరిజ్ఞానం ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఆయన ముంబైలో దీనికి సంబంధించిన కోర్సులు నేర్చుకుంటున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక దాని కోసమే సినిమా షూట్ డేట్ అనేది ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ వస్తున్నాయి. ఇక ఈ సినిమా సెట్స్ మీదకి ఎప్పుడు వెళ్తుంది అనే విషయాలను కూడా రాజమౌళి తొందర్లోనే ప్రేక్షకులకు తెలియజేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.
    అయితే ఇన్ని రోజుల నుంచి సినిమా ఎందుకు లేట్ అవుతుంది అనే దానిమీద సరైన క్లారిటీ అయితే రాలేదు. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే రాజమౌళి ఏఐ టెక్నాలజీ ని నేర్చుకోవడానికి కొంత సమయాన్ని తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది…