https://oktelugu.com/

Mahesh Babu ,Rajamouli : మహేష్ బాబు కి సింహం కి మధ్య ఉన్న స్టోరీ ఏంటో చెప్తున్న రాజమౌళి…

తెలుగు సినిమా ఇండస్ట్రీకి సూపర్ స్టార్ కృష్ణ ఎనలేని సేవలను అందించాడు. ఇక ఆ తర్వాత మహేష్ బాబు కూడా తన సినిమాలతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని రాజమౌళి తో కలిసి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడానికి చాలా వరకు కసరత్తులైతే చేస్తున్నాడు...మరి తను అనుకుంటున్నట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందో లేదో చూడాలి...

Written By:
  • Gopi
  • , Updated On : November 1, 2024 / 11:36 AM IST

    Rajamouli tells the story between Mahesh Babu and Simham...

    Follow us on

    Mahesh Babu ,Rajamouli : సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు. ఎందుకంటే ఆయన ఇప్పటికే వరుస సినిమాలను చేస్తూ భారీ సక్సెస్ లను అందుకున్నాడు. ఇక ఇండస్ట్రీ హిట్లను కూడా నమోదు చేసిన ఈ హీరో ప్రస్తుతం రాజమౌళితో చేయబోతున్న సినిమా కోసమే భారీ కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే మహేష్ బాబు తనదైన రీతిలో సినిమా చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక ఈ సినిమా దాదాపు సంవత్సరం నుంచి సెట్స్ మీదకి వెళుతుంది అంటూ వార్తలు వస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఆ సినిమా సెట్స్ మీదకైతే వెళ్లలేదు. సంవత్సరం నుంచి ఈ సినిమా కోసమే ఎదురు చూస్తున్నా మహేష్ బాబు తన గెటప్ ను మార్చుకోవడంలో చాలావరకు కసరత్తులు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. మరి రాజమౌళి ఈ సినిమాతో మహేష్ బాబుకి ఇండస్ట్రీ హిట్ ఇస్తానని మాట ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక దాని కోసమే మహేష్ బాబు తీవ్రమైన కసరత్తులైతే చేస్తున్నాడు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి ఈ సినిమాని సంక్రాంతి నుంచి సెట్స్ మీదకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.

    ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న మహేష్ బాబు లాంటి ఒక స్టార్ హీరో పాన్ వరల్డ్ లెవెల్ కి వెళ్లడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా రాజమౌళి సింహం ఎదురుగా నిలబడి ఆ సింహాన్ని తీక్షణంగా చూస్తున్న ఒక పిక్ ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు…

    అసలు ఆ సింహం స్టోరీ ఏంటి సింహానికి మహేష్ బాబు కి మధ్య ఏదైనా కనెక్షన్ ఉండబోతుందా మహేష్ బాబు సింహాన్ని వేటాడబోతున్నాడా అనే విషయాల మీద ఇప్పుడు తీవ్రమైన చర్చలైతే నడుస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో మహేష్ బాబు ఒక వారియర్ కనిపించబోతున్నాడనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక అందులో భాగంగానే సింహంతో తనకు పోటీ ఉండబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

    ఇక ‘త్రిబుల్ ఆర్’ సినిమాలో ఎన్టీఆర్ కి పులికి మధ్య ఒక ఫైట్ సీక్వెన్స్ ని పెట్టిన ఆయన ఇప్పుడు ఈ సినిమాలో సింహానికి మహేష్ బాబు కి మధ్య ఒక భారీ చేజింగ్ ను పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తెలియాలంటే రాజమౌళి ఈ సినిమా ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది….