https://oktelugu.com/

Mahesh Babu , Rajamouli : మహేష్ బాబు కు మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తున్న రాజమౌళి…బెంబేలెత్తిపోతున్న అభిమానులు…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి నటులు పాన్ ఇండియాలో భారీ గుర్తింపు సంపాదించుకొని వాళ్ళకంటూ ఒక క్రేజ్ నైతే ఏర్పాటు చేసుకున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : November 5, 2024 / 01:16 PM IST

    Rajamouli is teaching martial arts to Mahesh Babu...fans are getting excited...

    Follow us on

    Mahesh Babu , Rajamouli : రాజమౌళి మహేష్ బాబుతో చేస్తున్న సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకొని ముందుకు సాగుతున్నారు. పాన్ వరల్డ్ సినిమా అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించిన కూడా సినిమా మొదటికే మోసం వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. అందుకోసమే రాజమౌళి ఈ సినిమా మీద చాలా కేర్ తీసుకుంటూ సక్సెస్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఈ సినిమాలో ఒక మార్షల్ ఆర్ట్స్ ఫైట్ అయితే ఉందట. దానికోసం రాజమౌళి మహేష్ బాబు తో మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేయిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఇప్పటికే తనకంటూ ఒక భారీ గుర్తింపు సంపాదించుకోవడంలో మొదటి నుంచి కూడా తీవ్రమైన ప్రయత్నం చేస్తున్న మహేష్ బాబు ఇక రాజమౌళి పెట్టే టాస్క్ లను ఎదుర్కొంటు ముందుకు సాగుతున్నాడు. ఇక రీసెంట్ గా తన మేకోవర్ ను కూడా పూర్తి చేసుకున్న ఆయన ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడంలో చాలా బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది.ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక భారీ గుర్తింపును సంపాదించుకోవడంలో ఆయన ఎప్పుడు ముందు వరుసలో ఉంటున్నాడు. ఇక దాదాపు ‘గుంటూరు కారం’ సినిమా పూర్తి అయి సంవత్సర కాలం గడిచినప్పటికి మహేష్ బాబు కేవలం రాజమౌళికి ఇచ్చిన మాట కోసమే ఆయనతో పాటు ట్రావెల్ చేస్తున్నాడు.

    మరి ఈ సినిమా కనుక పాన్ వరల్డ్ లో సూపర్ సక్సెస్ ను సాధించినట్లయితే మహేష్ బాబు తన ఎంటైర్ కెరియర్ లో చేసిన సినిమాలకు రాని గుర్తింపు ఈ ఒక్క సినిమాతో వస్తుందనే చెప్పాలి. మరి తను కూడా ఈ సినిమా మీద భారీ కసరతులు చేస్తూ ముందుకు సాగుతున్నాడు… ఇక మొత్తానికైతే మహేష్ బాబు చాలా సున్నితంగా ఉంటాడు. కానీ రాజమౌళితో సినిమా అంటే హీరో మొత్తం నలిగిపోవాల్సిన అవసరమైతే ఉంది.

    ఇక బాహుబలి సమయంలో ప్రభాస్ చాలా విపరీతమైన కసరత్తులు చేసి మరి తన బాడిని బిల్డ్ చేసి మొత్తానికైతే ఆ సినిమాను సూపర్ సక్సెస్ గా నిలపడంలో కీలకపాత్ర వహించాడు. రామ్ చరణ్ ఎన్టీఆర్ లు కూడా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవడంలో సూపర్ సక్సెస్ అయ్యారు.

    ఇక ఏది ఏమైనా కూడా తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలంటే మాత్రం మహేష్ బాబుకి రాజమౌళి చెప్పింది చేయడం ఒక్కటే ఆప్షన్ గా తెలుస్తుంది… చూడాలి మరి ఈ సినిమాతో వీళ్లిద్దరు ఎలాంటి సక్సెస్ ని సాధిస్తారు అనేది…

    Tags