https://oktelugu.com/

Rajamouli&Keeravani : కీరవాణి ని అవమానిస్తున్న రాజమౌళి…ఇదంతా దానికోసమేనా..? అసలేం జరిగింది..?

తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా చేసిన దర్శకుడు రాజమౌళి....ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలన్నీ వరుస విజయాలను అందుకోవడంతో ఇప్పుడు ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా ఇండస్ట్రీని నిలపాలనే లక్ష్యం తో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది... ఈయన కనక ఇప్పుడు భారీ సక్సెస్ అందుకుంటే ఇక ఆయనను మించిన దర్శకుడు మరొకరు ఉండరు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది...

Written By:
  • Gopi
  • , Updated On : October 23, 2024 / 08:32 AM IST

    Rajamouli is insulting Keeravani... is this all for that..? What actually happened..?

    Follow us on

    Rajamouli&Keeravani: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలో రాజమౌళి కూడా తనదైన రీతిలో సినిమాలు చేయడమే కాకుండా సూపర్ సక్సెస్ లను కూడా అందుకుంటున్నాడు. మరి ఇప్పుడు ఆయన చేస్తున్న పాన్ వరల్డ్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా తనను తాను స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఈ సందర్భంలో ఆయన చేస్తున్న సినిమాల మీద ప్రేక్షకుల్లో విపరీతమైన హైప్ అయితే క్రియేట్ అవుతుంది. ఇంతకుముందు ఆయన చేసిన త్రిబుల్ ఆర్ సినిమా భారీ సక్సెస్ ని సాధించింది. అలాగే ఎన్టీఆర్ రామ్ చరణ్ అభిమానుల్లో ఎక్కడలేని ఆనందాన్ని నింపాడనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమా మంచి విజయాన్ని సాధించి ప్రపంచ సినిమా చరిత్రలో మిగిలిపోవాలని కోరుకుంటున్నారు. ఇక ఇప్పుడు వరల్డ్ సినిమా ఇండస్ట్రీ లో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్గా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. అయితే రాజమౌళి ఈ సినిమా కోసం చాలా వరకు కష్టపడుతున్నాడు.

    ఇక అందులో భాగంగానే ఈ సినిమాలో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లను తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళెవరంటే కీరవాణి, సంతోష్ నారాయణ, అనిరుధ్… ఇక ఇప్పటికే వీళ్ళను రాజమౌళి ఎంపిక చేసినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. అయితే రాజమౌళి చేసిన మొదటి సినిమా నుంచి త్రిబుల్ ఆర్ సినిమా వరకు అన్ని సినిమాలకి కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించాడు.

    మరి ఇప్పుడు ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్ లను తీసుకుంటారనే వార్తలు వస్తున్నాయి. ఇలా కనక జరిగితే రాజమౌళి కీరవాణి ని అవమానించినట్టే అవుతుందని మరి కొంతమంది భావిస్తున్నారు. ఎందుకు అంటే కీరవాణి మ్యూజిక్ సరిగ్గా ఇవ్వలేకపోవడం వల్లే ఆయన మిగతా ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లను కూడా తీసుకోవాల్సి వస్తుందనే వార్తలైతే వస్తాయి. కాబట్టి కీరవాణి ని రాజమౌళి అవమానించాడు అంటూ కొన్ని కథనాలు కూడా వెలువడుతున్నాయి.

    ఇక మొత్తానికైతే రాజమౌళి ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్ తీసుకున్నాడా? లేదా అనేది తెలియాలంటే రాజమౌళి అఫీషియల్ గా ఈ సినిమా గురించిన అనౌన్స్ మెంట్ ఇవ్వాల్సిన అవసరమైతే ఉంది… ఇక ఈ సినిమా మీదనే మహేష్ బాబు భారీ అంచనాలు పెట్టుకున్నాడు. అందుకోసమే దాదాపు సంవత్సరం నుంచి ఖాళీగా ఉంటున్నా కూడా మహేష్ బాబు అసలేం మాట్లాడడం లేదు… ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనడం కోసమే ఎదురు చూస్తున్నాడు…