https://oktelugu.com/

Rajamouli & Mahesh Babu : మహేష్ బాబు ను మరో గెటప్ లోకి మారుస్తున్న రాజమౌళి…ఇందులో మహేష్ బాబు డ్యూయల్ రోల్ చేస్తున్నాడా..?

తెలుగు సినిమా స్థాయిని పెంచిన రాజమౌళి ప్రస్తుతం పాన్ ఇండియా పరిధిని దాటి పాన్ వరల్డ్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి ఇప్పుడు వరల్డ్ లోనే ది బెస్ట్ సినిమా చేయడానికి ఉత్సాహన్ని చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక దానికోసం మహేష్ బాబుతో కలిసి ముందడుగు వేస్తున్న రాజమౌళి తొందర్లోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ని ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు...

Written By:
  • Gopi
  • , Updated On : November 2, 2024 / 01:37 PM IST

    Rajamouli is changing Mahesh Babu into another getup... is Mahesh Babu doing a dual role in this..?

    Follow us on

    Rajamouli & Mahesh Babu : దర్శక ధీరుడి గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ రాజమౌళి…ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవాలని ఆయన భారీగా కసరత్తులనైతే చేస్తున్నాడు. ఇక ఆయన అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధిస్తాడా? లేదా అనే విషయాలు కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఏది ఏమైనా కూడా గుంటూరు కారం సినిమా రిలీజ్ అయి దాదాపు సంవత్సరం కావస్తున్న నేపధ్యంలో మహేష్ బాబు అప్పటి నుంచి ఇప్పటివరకు ఖాళీగానే ఉంటున్నాడు. సినిమాలు చేయడం లేదు. అలాగే యాడ్ ఫిలిమ్స్ లో కూడా నటించడం లేదు. ఈ రకంగా మహేష్ బాబు భారీగా నష్టపోతున్నాడనే చెప్పాలి. ఈ సందర్భంలో ఆయన నుంచి రాబోయే సినిమా విషయంలో సరైన క్లారిటీ అయితే రావడం లేదు. నిజానికి సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నామనే విషయాన్ని రాజమౌళి మహేష్ బాబుకి కూడా చెప్పడం లేదట. మరి ఈ విషయాన్ని మహేష్ బాబు తన సన్నిహితుల దగ్గర చెబుతూ కొంతవరకు బాధపడుతున్నట్టుగా కూడా తెలుస్తోంది.

    ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు లుక్కులో చాలా వరకు ఒక కొత్త రకం లుక్కుని తీసుకొచ్చే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నాడు. ఇక ఇప్పటికి రెండు మూడు లుక్కులను ట్రై చేసిన మహేష్ బాబు మరొక లుక్ లోకి మారబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి రాజమౌళి ఇన్ని లుక్స్ ను ఎందుకు ట్రై చేస్తున్నాడు.

    ఏదో ఒక లుక్ కి ఫిక్స్ అయిపోయి మహేష్ బాబు ను అందులోనే చూపించచ్చు కదా అంటూ కొంతమంది వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక అందుతున్న సమాచారం ప్రకారమైతే ఈ సినిమాలో మహేష్ బాబు డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడని చెబుతున్నారు. ఇక దానికోసమే రెండు రకాల లుక్స్ ని రాజమౌళి ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది…

    ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబుతో భారీ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న రాజమౌళి పాన్ వరల్డ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్లను సైతం ఢీకొట్టే విధంగా ముందుకు సాగుతున్నాడు…ఇక ఇది కనక పర్ఫెక్ట్ ప్లానింగ్ తో డెలివరీ అయితే రాజమౌళి ని మించిన దర్శకుడు ఇండియాలోనే కాదు ప్రపంచంలో కూడా ఎవ్వరూ ఉండరనే రేంజ్ లో ఆయన తనను తాను ఎలివేట్ చేసుకుంటాడనే చెప్పాలి…