https://oktelugu.com/

Rajamouli : ఆ విషయం లో ఎన్టీయార్ ను భారీగా దెబ్బ కొట్టిన రాజమౌళి…కారణం ఏంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి క్రమం లోనే వాళ్లు తమదైన రీతిలో సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరో సినిమా ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపును సంపాదించుకుంటున్నప్పటికి భారీ సక్సెస్ లను మాత్రం సాధించలేకపోతున్నాడు..

Written By:
  • Gopi
  • , Updated On : October 24, 2024 / 12:33 PM IST

    Rajamouli hit NTR heavily in that matter...what was the reason...?

    Follow us on

    Rajamouli : నందమూరి ఫ్యామిలీ నుంచి మూడోతరం హీరోగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్నాడు. రీసెంట్ గా దేవర సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఆయన తదుపరి సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న ఆయన పాన్ ఇండియాలో హీరోగా ఎదగడం కోసమే తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే రాజమౌళితో సినిమాలను చేసి స్టార్ స్టేటస్ ని అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి వల్లే తను భారీగా దెబ్బ తిన్నాడనే విషయం చాలా మందికి తెలియదు. ఇక రాజమౌళి కెరియర్ స్టార్టింగ్ లోనే జూనియర్ ఎన్టీఆర్ ని పిక్ స్టేజ్ లో చూపించాడు. ఇక దాని తర్వాత మిగతా దర్శకులు ఎవరు ఎలా చూపించిన కూడా ఆ క్యారెక్టర్ తోనే పోల్చుకుంటూ సినిమాలు బాగున్నా కూడా భారీ కలెక్షన్స్ అయితే రాలేకపోతున్నాయి. ఇక ముఖ్యంగా సింహాద్రి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. తన ఏజ్ కు మించిన పాత్రను చేయడమే కాకుండా అందులో ఒదిగిపోయి నటించాడు.
    దాంతో వచ్చిన ప్రతి సినిమాని సింహాద్రితో పోల్చి చూడడం దాని వల్ల ఆయనకు వరుసగా ప్లాపులు వస్తూనే ఉన్నాయి. అప్పటినుంచి ఇప్పటివరకు ఆయనకు సరైన ఇండస్ట్రీ హిట్టు కూడా లేకపోవడానికి కారణం రాజమౌళి అనే చెప్పాలి. ప్రతి విషయంలో రాజమౌళి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హీరోని భారీగా ఎలివేట్ చేస్తాడు కానీ ఆయనతో సినిమా చేసిన తర్వాత ఆ హీరో చేసి సినిమా సక్సెస్ సాధించాలంటే మాత్రం తో చాలా కష్టంతో కూడుకున్న పని అనేది హీరోలందరి విషయంలో రుజువు అయింది.
    ఇక రీసెంట్ గా ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్న తర్వాత చేసిన దేవర సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నప్పటికి అది ఎన్టీఆర్ రేంజ్ సక్సెస్ అయితే కాదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇక బాహుబలి సినిమాలో కట్టప్ప ఎలాగైతే అమరేంద్ర బాహుబలిని వెన్నుపోటు పొడిచాడో రాజమౌళి కూడా ఎన్టీఆర్ ని అదే చేశాడు అంటూ చాలామంది అభిప్రాయపడుతున్నారు.
    ఇక మొత్తానికైతే ఎన్టీఆర్ నెంబర్ వన్ హీరోగా ఎదిగడానికి రాజమౌళి మంచి సినిమాలు తీశాడు. కానీ తన ఎదురుగుదల ఆగిపోవడానికి కూడా అవే సినిమాలు కారణం అవ్వడం అనేది ఇప్పుడు ప్రేక్షకులందరిని కలవరానికి గురి చేస్తుంది…