https://oktelugu.com/

Pushpa 2 : పుష్ప 2 ప్రిమియర్స్ పైన ఇప్పటి నుంచే చర్చ నడుస్తుందా..? అసలు ఈ సినిమా అనుకున్న టైమ్ కి వస్తుందా.?

సినిమా ఇండస్ట్రీ లో చాలామంది హీరోలు స్టార్ డమ్ కోసం అహర్నిశలు కష్టపడుతుంటారు. ఇక్కడ కొంతమంది ఈజీగా స్టార్లు అవుతుంటే మరి కొంత మంది మాత్రం చాలా కసరత్తులు చేసిన కూడా స్టార్ స్టేటస్ దక్కడం లేదు. ఇక స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న ప్రతి ఒక్కరు వాళ్ల సినిమా సెలక్షన్స్ లో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది.

Written By:
  • Gopi
  • , Updated On : October 24, 2024 / 01:05 PM IST

    Pushpa 2 premieres will be discussed from now on..? Will this movie actually come on time?

    Follow us on

    Pushpa 2 : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్  స్టైలిష్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును  క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమాతో తనదైన రీతిలో గుర్తింపు సంపాదించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆయన ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ను సాధించాలని చూస్తున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాను డిసెంబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ప్రస్తుతానికి తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్న ఆయన ఎలాగైనా సరే పుష్ప 2 సినిమాని భారీ సక్సెస్ చేయడంలో తను ముందు వరుసలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి మొత్తానికైతే ఆయన చేస్తున్న ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించి ఎలాగైనా సరే ఇండియాలో తను నెంబర్ వన్ హీరోగా ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక దానికి అనుగుణంగానే ఈ సినిమా మీద హైప్ పెంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ చేస్తున్న సందర్భంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ ని ఎప్పుడు వెయ్యాలి అనేదాని మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది.
    ఇక ప్రస్తుతం సినిమా యూనిట్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీమియర్స్ ని ఓవర్సీస్ లో డిసెంబర్ 4వ తేదీన ప్రదర్శించబోతున్నారు. ఇక ఇండియాలో డిసెంబర్ 5వ తేదీన ప్రీమియర్స్ ప్రదర్శింపబడుతున్నట్టుగా తెలుస్తోంది.
    ఇక డిసెంబర్ 6వ తేదీన సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రీమియర్స్ తోనే ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది తెలిసిపోనుంది. ఇక ఈ సినిమా ఎలాగైనా సరే భారీ సక్సెస్ గా నిలపడానికి అల్లు అర్జున్ అహర్నిశలు కష్టపడుతున్నాడు. ప్రస్తుతం సుకుమార్, అల్లు అర్జున్ ఇద్దరు ఎలాగైనా సరే ఈ సినిమాని పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ గా నిలపడానికి ప్రయత్నం చేస్తున్నారు.
    ఇక అల్లు అర్జున్ ఈ సినిమాతో కనక సక్సెస్ ని సాధిస్తే మాత్రం ఆయన క్రేజ్ తార స్థాయిలోకి చేరుతుందనే చెప్పాలి. ఇక  ఇప్పుడు సుకుమార్ కూడా పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా వెలుగొందుతాడు. అందుకే ఈ సినిమా విషయంలో సుకుమార్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్నాడు… చూడాలి మరి ఈ సినిమాతో 1500 కోట్ల కలెక్షన్లు రాబడతారు లేదా అనేది…