Pushpa 2 : పుష్ప 2 మూవీకి భారీ హైప్ వల్ల పెను ప్రమాదం జరగనుందా..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను చాటుకున్న నటుడు అల్లుఅర్జున్... ప్రస్తుతం ఆయన వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇక ఇప్పటికే ఆయన చేసిన పుష్ప 2 సినిమాను డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు...ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించడానికి ప్రయత్నం చేస్తున్నాడు...
Written By:
Gopi, Updated On : October 30, 2024 3:15 pm
Follow us on
Pushpa 2 : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప 2 సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. అయితే ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ మేకర్స్ ఒక డేట్ అయితే అనౌన్స్ చేశారు. ఇక దానికోసమే ప్రేక్షకులు అభిమానులు విపరీతంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా మీద భారీ హైప్ అయితే ఉంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమా కోసమే చాలామంది ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారనే విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమాకి భారీ క్రేజ్ అయితే దక్కుతుంది. పుష్ప మొదటి పార్ట్ తెలుగులో పెద్దగా ఆశించిన విజయాన్ని సాధించనప్పటికి బాలీవుడ్ లో మాత్రం సూపర్ సక్సెస్ సాధించింది. దాంతో సెకండ్ పార్ట్ మీద కూడా భారీ అంచనాలైతే పెరుగుతున్నాయి. ఇక ఈ సినిమా హిందీలో భారీ రికార్డులను కూడా క్రియేట్ చేయబోతుంది అంటూ కొంతమంది సినిమా పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేయడం విశేషం. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా మీద భారీ హైప్ ఉండడం వల్ల సినిమాకి ఏదైనా ఇబ్బంది కలగవచ్చు అంటూ మరి కొంతమంది సినిమా విమర్శకులు సైతం ఈ సినిమాను విమర్శిస్తున్నారు. ఒకవేళ సినిమా బాగుంటే పర్లేదు కానీ లేకపోతే మాత్రం ఈ హైప్ వల్ల సినిమా భారీ డిజాస్టర్ ను మూటగట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయంటూ వాళ్ళ అభిప్రాయాలను తెలియజేయడం విశేషము.
ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఏ సినిమాకు రానంత హైపు పుష్ప 2 సినిమాకు అయితే వస్తుంది. ఇక ఇది కూడా ఒకరకంగా శుభ పరిణామమే అయినప్పటికీ కొంచెం తేడా కొడితే మాత్రం ఇబ్బంది పడే అవకాశమే ఉంది.
కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ సినిమాని తెరకెక్కించడానికి సుకుమార్ భారీ ప్రణాళికలు చేసుకున్నాడు. ఇక దాంతో పాటుగా పోస్ట్ ప్రొడక్షన్ లో కూడా తమ వైఖరిని చాటుకునేలా సినిమాని తీర్చిదిద్దే ప్రయత్నంలో సుకుమార్ చాలా బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది…
ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండడమే కాకుండా ఈ సినిమాని చూడడానికి కూడా చాలామంది ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉండడం విశేషం… ఇక పుష్ప 2 సినిమా ఒక భారీ సక్సెస్ సాధిస్తే అల్లు అర్జున్ కెరీర్ అనేది భారీగా ముందుకు వెళుతుందనే చెప్పాలి. లేకపోతే మాత్రం ఆయన అనుకున్న రేంజ్ లో సక్సెస్ ని సాధించలేకపోవచ్చు…