Puri Jagannath : పూరి జగన్నాథ్ కి హీరో దొరికాడు…ఆ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడా..?
సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు ఫీడౌట్ దశకు దగ్గరగా ఉన్నారు. కొంత మంది సీనియర్ డైరెక్టర్లు ఇప్పుడు కూడా వరుస సినిమాలను చేస్తు సక్సెస్ లను అందుకుంటుంటే మరి కొంత మంది దర్శకులు మాత్రం చేసిన సినిమాలతో సక్సెస్ సాధించలేక డీలా పడిపోతున్నారు...
Written By:
Gopi, Updated On : October 29, 2024 10:38 am
Follow us on
Puri Jagannath : తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు పూరి జగన్నాధ్…ఈయన ఒకప్పుడు పెను సంచలనాలను సృష్టించాడు. ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు ఇండస్ట్రీలో రికార్డులన్నీ బ్రేక్ అవుతూ ఉండేవి. మరి ఇలాంటి పూరి జగన్నాథ్ ఇప్పుడు తన పాన్ ఇండియాలో ఏ మాత్రం తన సత్తా చాటుకోలేకపోతున్నాడు. ఇక రీసెంట్ గా రామ్ ను హీరోగా పెట్టి తీసిన డబుల్ ఇస్మార్ట్ సినిమా కూడా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. ఇక దాంతో వరుసగా రెండు డిజాస్టర్లను అందుకున్న ఈ దర్శకుడికి హీరోలేవ్వరు డేట్స్ ఇవ్వరు అంటూ కొన్ని వార్తలైతే బయటకు వచ్చాయి. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం పూరి జగన్నాధ్ కి ఒక స్టార్ హీరో డేట్స్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి పూరి కి డేట్స్ ఇచ్చిన హీరో ఎవరు బాలీవుడ్ హీరోనా? లేదంటే టాలీవుడ్ హీరోనా అనే విషయం లో సరైన క్లారిటీ లేదు. కానీ ఒక హీరో నుంచి అయితే తనకు డేట్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక దానికి సంబంధించిన కథను రాసే పనిలోనే పూరి జగన్నాధ్ చాలా బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇంతకు ముందు మహేష్ బాబు తో బిజినెస్ మేన్ అనే సినిమా చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్న పూరి జగన్నాధ్ ఇప్పుడు అదే సినిమాకి సీక్వెల్ ను తీసే పనిలో బిజీగా ఉన్నాడట. మరి ఈ హీరో తోనే ఆ సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక బిజినెస్ మేన్ సినిమాలో మహేష్ బాబు వన్ మ్యాన్ షో చేసిన విషయం మనకు తెలిసిందే. పూరి జగన్నాధ్ రాసిన డైలాగులను మహేష్ బాబు చాలా అద్భుతంగా చెప్పడంతో ఆ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన హైప్ అయితే క్రియేట్ అయింది.
ఇక దాని వల్ల సినిమా సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా మహేష్ బాబు కూడా స్టార్ హీరో ఇమేజ్ అయితే సొంతం చేసుకున్నాడు. మరి ఇలాంటి సూపర్ సక్సెస్ సాధించిన సినిమాకి సీక్వెల్ తీయడం అవసరమా అంటూ కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.
దానికి సీక్వెల్ తీస్తే మంచి సినిమాను చెడగొట్టినట్టు అవుతుంది తప్ప ఆ సినిమాకు మించి ఇప్పుడు పూరి జగన్నాధ్ తీయబోయే సీక్వెల్స్ సినిమా అయితే ఉండదు అంటూ ఇంకొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.
మరి ఏది ఏమైనా కూడా పూరి జగన్నాధ్ ఫామ్ లోకి వచ్చి సినిమాని సీరియస్ గా చేస్తే మాత్రం ఆ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…