Prashanth Verma : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ డైరెక్టర్లు స్టార్ హీరోలతో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి సమయంలోనే కొంతమంది యంగ్ హీరోలు మాత్రం వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా తమకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న చాలామంది వాళ్లను వాళ్ళు భారీ రేంజ్ లో ఎలివేట్ చేసుకుంటున్నారు. ఇక కొత్త కథలతో సినిమా ఇండస్ట్రీకి వస్తున్న యంగ్ డైరెక్టర్స్ మాత్రం వైవిధ్యభరితమైన కథాంశాలను ఎంచుకుంటూ సినిమాలుగా చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా వాళ్ళను వాళ్లు స్టార్ డైరెక్టర్స్ గా ప్రూవ్ చేసుకోవాలంటే మాత్రం సినిమా ఇండస్ట్రీలో మంచి కథలతో సినిమాలు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న యంగ్ డైరెక్టర్లందరు పాన్ ఇండియా డైరెక్టర్లుగా మారుతున్నారు. ప్రశాంత్ వర్మ లాంటి దర్శకుడు సైతం తమదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు సాగడమే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలతో సినిమాలు చేయడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నాడు. ఇక ఇప్పటికే హనుమాన్ సినిమాకి సీక్వెల్ గా ‘జై హనుమాన్’ అనే సినిమా చేస్తున్న ఈయన ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ను సాధించాలని చూస్తున్నాడు…
ఇక ఇతనితో పాటుగా సుజీత్ కూడా మంచి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక తన ఎంటైర్ కెరియర్ లో ఇప్పటివరకు చేసిన రెండు సినిమాలు మంచి విజయాలను సాధించడమే కాకుండా ఆయనకు దర్శకుడి గా మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి.
ఇక ఇప్పుడు చేస్తున్న ఓజి సినిమా కూడా ప్రేక్షకుల్లో విశేషమైన స్పందనను రాబట్టడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని కూడా క్రియేట్ చేసుకుంటున్నాడు…ఇక వీళ్లతో పాటుగా కల్కి సినిమా చేసి భారీ సక్సెస్ ని అందుకున్న నాగ్ అశ్విన్ కూడా పెను ప్రభంజనాలను సృష్టిస్తూ ముందుకు సాగుతున్నాడు. అయితే ఈ ముగ్గురు దర్శకులలో ఎవరు పాన్ ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా మారబోతున్నారు అనే విషయాల మీదనే సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది.
ఇక ప్రస్తుతానికైతే ఈ ముగ్గురిలో ‘కల్కి 2898 ఎడి’ సినిమాతో భారీ కలెక్షన్లు రాబట్టి కొంతవరకు ముందు వరుసలో ఉన్నప్పటికి రెండు సంవత్సరాలలో ఈ ముగ్గురు మాత్రం స్టార్ డైరెక్టర్లుగా ఎదగడమే కాకుండా వీళ్ళలో ఎవరు నెంబర్ వన్ దర్శకుడిగా మారతారు అనే విషయం మీదనే చాలా రకాల ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి…