Prashant Neel Bagheera : ప్రశాంత్ నీల్ బఘీర మీద బజ్ లేదా..? పెద్దగా టికెట్స్ బుక్ అవ్వడం లేదా..?
సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఎలా ఉన్నా కూడా కొంతమంది స్టార్ డైరెక్టర్లు మాత్రం వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. అందులో ప్రశాంత్ నీల్ ఒకరు... ఇక ఇదిలా ఉంటే ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నాయి...ఇక ఇప్పుడు ఈయన ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ గా వెలుగొందటం విశేషం...
Written By:
Gopi, Updated On : October 29, 2024 2:35 pm
Follow us on
Prashant Neel Bagheera : కన్నడ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్…కే జి ఎఫ్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని తెచ్చుకోవడమే కాకుండా పాన్ ఇండియాలో కూడా స్టార్ డైరెక్టర్ గా వెలుగొందుతున్నాడు. ఇక ఇప్పటివరకు ఈయన చేసిన సినిమాలన్నీ మంచి విజయాలు సాధించడంతో ప్రస్తుతం పాన్ ఇండియాలో ఉన్న టాప్ డైరెక్టర్ ల లిస్టులో ఈయన కూడా చేరిపోయాడు. ఇప్పుడు ఎన్టీఆర్ తో చేస్తున్న డ్రాగన్ సినిమాతో తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో రెండు వేల కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టి బాహుబలి 2 రికార్డును కూడా బ్రేక్ చేయాలనే విధంగా ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా టాప్ డైరెక్టర్ గా ఎదగడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక కన్నడ సినిమా ఇండస్ట్రీ అంటే అంతకుముందు అందరికి చిన్న చూపు ఉండేది.
కానీ అక్కడి నుంచి కూడా ఎక్స్పరమెంట్లు చేసి సక్సెస్ ని సాధించవచ్చు అని అయినా నిరూపించాడు…ఇక ఇదిలా ఉంటే ఆయన కథ మాటలు అందించిన బఘీర సినిమా ఈ నెల 31వ తేదీన దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ట్రైలర్ ను చూస్తే కేజిఎఫ్ సినిమాల మాదిరిగానే ఉంది. ఇక ఈ సినిమాకి సూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రశాంత్ నీల్ తన స్టైల్ లోనే ఈ సినిమాని తీయించినట్టుగా తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ శ్రీమురళి ప్రశాంత్ నీల్ కావడం విశేషం… ఇక తనని కూడా పాన్ ఇండియాలో స్టార్ హీరోని చేయాలనే ఉద్దేశ్యంతోనే ఆయన ఈ సినిమాను తీస్తున్నాడు. మరి ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధిస్తుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ట్రైలర్ కొత్తగా అనిపించినప్పటికి ఈ సినిమా మీద తెలుగులో పెద్దగా బజ్ అయితే లేదు.
ఇక ఇప్పటికే బుక్ మై షో లో ఈ సినిమాకి సంబంధించిన టికెట్లు అవలేబుల్ లో ఉన్నప్పటికి పెద్దగా బుక్ అయితే కావడం లేదు. కారణం ఏదైనా కూడా ఈ సినిమా ప్రేక్షకుడిని థియేటర్ కి రప్పించే విధంగా అయితే కనిపించడం లేదు. ఒకవేళ సినిమా రిలీజై పాజిటివ్ టాక్ వస్తే తప్ప ఈ సినిమాను చూడడానికి ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించకపోవచ్చు…