Prabhas : ఒకే సంవత్సరం లో రెండు సినిమాలను రిలీజ్ చేసిన ప్రభాస్… అవి ఏ సినిమాలు.. వాటి పరిస్థితి ఏంటి.?

తెలుగు సినిమా ఇండస్ట్రీ రోజు రోజుకి ఒక కొత్త పంథా లో ముందుకు దూసుకెళ్తుంది. పాన్ ఇండియాలో వరుస సక్సెస్ లను సాధిస్తున్న ఏకైక ఇండస్ట్రీగా తెలుగు సినిమా ఇండస్ట్రీ భారీ గుర్తింపును సంపాదించుకుంది. తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరు పాన్ ఇండియాలో పెను ప్రభంజనాన్ని సృష్టించడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి...

Written By: Gopi, Updated On : October 26, 2024 9:41 am

Prabhas who released two films in the same year... which films are they... what is their condition?

Follow us on

Prabhas : ప్రస్తుతం ఉన్న రోజుల్లో రెండు సంవత్సరాలకు ఒక సినిమాని రిలీజ్ చేస్తున్న మన స్టార్ హీరోలు సినిమా సినిమాకి చాలా ఎక్కువ గ్యాప్ ని తీసుకుంటున్నారనే విమర్శలైతే ఎదుర్కొంటున్నారు. నిజానికి వారు చేసే సినిమాలు భారీ స్కేల్ తో ఉండడం వల్లే వాళ్ళు ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సిన అవసరమైతే వస్తుంది. కానీ ఇలాంటి సందర్భంలోనే మనవాళ్లు చేస్తున్న ప్రతి సినిమా భారీ రేంజ్ లో ఉంటుంది. ఇక దానికి తగ్గట్టుగా హీరోలు ప్రణాళికలను చేసుకొని సినిమా చేసేసరికి ఈజీగా రెండు నుంచి మూడు సంవత్సరాల సమయం అయితే పడుతుంది. మరి అలా కాకుండా ఒకే సంవత్సరంలో ప్రభాస్ లాంటి స్టార్ హీరో రెండు సినిమాలను రిలీజ్ చేశారు అనే విషయం మీకు తెలుసా..? ఆ సినిమాలు ఏంటి? ఆ రెండు సినిమాల పరిస్థితి ఎలా ఉంది అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…
2023 వ సంవత్సరంలో ప్రభాస్ ఏకంగా రెండు సినిమాలను రిలీజ్ చేశాడు. మొదట ‘ఆది పురుషు’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఆయన ఆ సినిమాతో డిజాస్టర్ ని మూట గట్టుకున్నాడు. ఇక ఆశించిన మేరకు ఆ సినిమా లేకపోవడంతో ప్రభాస్ అభిమానులు తీవ్రమైన నిరాశకు గురయ్యారు. గ్రాఫిక్స్ కూడా చాలా పూర్ గా ఉండడం ప్రభాస్ కూడా అంత బాగా ఎలివేట్ కాకపోవడం వల్లే ప్రేక్షకులు ఆ సినిమా నుంచి డివియేట్ అయ్యారు. నిజానికైతే దర్శకుడు ఓంరావత్ ఈ సినిమా మీద ఎలాంటి కేర్ తీసుకోనట్టుగా మనకు ఈజీగా తెలిసిపోతుంది. ప్రభాస్ లాంటి స్టార్ హీరో దొరికినప్పుడు చాలా మంచి సినిమాలు చేసి సూపర్ సక్సెస్ ని అందుకోవాల్సింది పోయి ఇలాంటి ఒక నాసిరకం సినిమాను చేసి విమర్శల పాలయ్యాడు…
ఇక ఇదిలా ఉంటే 2023 చివర్లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘సలార్ ‘ సినిమా భారీ సక్సెస్ ని సాధించింది. నిజానికి ఈ సినిమాతో ప్రభాస్ ఒక్కసారిగా పెను ప్రభంజనాన్ని సృష్టించాడు. దాదాపు 800 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా ప్రభాస్ కెరియర్ లోనే ఒక మైలురాయిగా మిగిలిపోయింది.
అందుకే ప్రభాస్ లాంటి స్టార్ డమ్ ను గుర్తించిన దర్శకులు ఆయనతో ఎలాంటి సినిమాలు చేస్తే వర్కౌట్ అవుతుందనేది తెలుసుకొని అలాంటి సినిమాలకే ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుందంటూ సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేయడం విశేషం. ఇక ఇప్పుడున్న స్టార్ హీరోలందరిలో ఒకే సంవత్సరంలో రెండు సినిమాలు రిలీజ్ చేసిన స్టార్ హీరోగా ప్రభాస్ ఒక రికార్డుని క్రియేట్ చేశాడు. ఇక అందులో ఒక సినిమా ఫ్లాప్ అయితే మరొక సినిమా సూపర్ హిట్ అవ్వడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి…