https://oktelugu.com/

Mahesh Babu & Pawan Kalyan : ఆ విషయాల్లో మహేష్ బాబు తో పోలిస్తే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చాలా బెటర్…

సినిమా ఇండస్ట్రీ అనేది ఒక్కొక్కరికి ఒక్కో అనుభవాన్ని ఇస్తుంది. కొంతమంది ఇక్కడ స్టార్ హీరోలుగా ఎదిగితే మరికొంతమంది అవకాశాలు లేక ఇండస్ట్రీ నుంచి ఫెయిడ్ ఔట్ అయిపోతూ ఉంటారు. ఇక ఎవ్వరు ఏం చేసినా కూడా సక్సెస్ అనేది ఇక్కడ ప్రతి ఒక్కరికి కావాల్సిందే. లేకపోతే సినిమా ఇండస్ట్రీలో మనుగడ అనేది చాలా కష్టతరం అవుతుందనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : November 6, 2024 / 09:46 AM IST

    Pawan Kalyan Pawan Kalyan is much better compared to Mahesh Babu in those matters...

    Follow us on

    Mahesh Babu & Pawan Kalyan : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ చాలా ఎక్కువనే చెప్పాలి. స్టార్ హీరోల్లో ఈ ఇద్దరు వాళ్ళకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా క్లాస్ మాస్ అనే తేడా లేకుండా ప్రేక్షకులందరిలో వాళ్ల సినిమాల తాలూకు ఇంపాక్ట్ అయితే భారీ ఉంటుందంటే వాళ్ళు ప్రేక్షకుల్ని ఎంతలా మెస్మరైజ్ చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఎప్పుడైతే వీళ్ళ నుంచి ఒక సినిమా వస్తుంది అని అనౌన్స్ చేస్తారో అప్పటినుంచి అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లో కూడా ఆ సినిమా కోసం ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. ఇక మొత్తానికైతే వీళ్లు చేస్తున్న సినిమాలు ప్రేక్షకుల్లో ఒక భారీ క్రేజీ ని కూడా సంపాదించుకుంటూ ఉంటాయి. ఇక ఇదిలా ఉంటే వీళ్ళిద్దరిలో కొన్ని సిమిలర్ క్వాలిటిస్ ఉన్నప్పటికి కొన్ని విషయాల్లో మహేష్ బాబు కంటే పవన్ కళ్యాణ్ బెటర్ అని చాలామంది అంటూ ఉంటారు. దాని కారణం ఏంటి అంటే సినిమాల విషయం పక్కన పెడితే మహేష్ బాబు కు చాలావరకు మొహమాటం అయితే ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ కి అలాంటిది ఏమీ లేదని రీసెంట్ గా ఆయన పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత తెలిసింది. ఆయన ఏది మాట్లాడాలనుకుంటే అది చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతూ ఉంటాడు. కానీ మహేష్ బాబు మాత్రం పబ్లిక్ ఫంక్షన్స్ కి రావాలన్న పబ్లిక్ లో కలవాలన్నా కూడా ఆయన చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇక విషయాన్ని మనం ఇప్పటికి చాలా సార్లు చూశాం…

    కాబట్టి మహేష్ బాబు తో పోలిస్తే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ చాలా బెటర్ అని చాలామంది సినీ మేధావులు వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ ఇద్దరు స్టార్ హీరోలు తెలుగు సినిమా స్థాయిని పెంచడంలో మొదటి నుంచి కూడా చాలా వరకు కృషి చేస్తూ వస్తున్నారు…

    ఇక ఇప్పుడు రాబోయే సినిమాలతో వీళ్ళకంటూ ఒక క్రేజ్ ను సంపాదించుకోవడమే కాకుండా పాన్ ఇండియా లో కూడా ప్రేక్షకులను ఆకట్టుకొని అక్కడి ప్రేక్షకులందరిని తమ ఫ్యాన్స్ గా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

    ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ పాలిటిక్స్ లో చాలా క్రియాశీలకమైన పాత్రను పోషిస్తున్నప్పటికి సినిమా ఇండస్ట్రీలో కూడా తనదైన మార్కు చూపించడానికి మరోసారి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది…