https://oktelugu.com/

Nitin, Balayya : రాబిన్ హుడ్ కథ తో వస్తున్న నితిన్, బాలయ్య…వీళ్లలో సక్సెస్ కొట్టేదెవరు..?

సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు మూస ధోరణిలో సాగే సినిమాలకు మంచి సక్సెస్ లు దక్కేవి. కానీ ఇప్పుడు ప్రేక్షకుడి అభిరుచి మారింది. దానికి తగ్గట్టుగానే సినిమాలు తీసే విధానం కూడా మారింది...

Written By:
  • Gopi
  • , Updated On : November 5, 2024 / 08:04 AM IST

    Nitin, Balayya who is coming with the story of Robin Hood...who among them will be successful..?

    Follow us on

    Nitin, Balayya : తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబుకి నటుడిగా చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. ఇక నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ హీరో తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే బాలయ్య బాబు చేస్తున్న సినిమాల పైన ప్రేక్షకుల్లో అమితమైన ఆసక్తి అయితే పెరుగుతుంది. ఇక వరుసగా ఇప్పటికే మూడు సక్సెస్ లను అందుకున్న బాలయ్య బాబు ఇప్పుడు బాబీ డైరెక్షన్ లో రాబోతున్న సినిమాతో నాలుగో సక్సెస్ ను కూడా తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో తనను తాను చాలా కొత్తగా ప్రజెంట్ చేసుకోవడమే కాకుండా ప్రేక్షకులకు నచ్చే విధంగా కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ ని కూడా ఈ సినిమాలో యాడ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ముఖ్యంగా బాలయ్య బాబు రౌద్రం ప్రదర్శించడంలో దిట్ట…అలాగే ఎమోషన్స్ పండించడంలో కూడా ఆయన తనదైన రీతిలో నటించి మెప్పిస్తాడు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు బాబీ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా రాజస్థాన్ లోని ఒక ప్రాంతంలో రాబిన్ హుడ్ కి సంబంధించిన సినిమా కథ గా సాగబోతుందట.

    మరి దానికి తగ్గట్టుగానే సినిమాలోని కొన్ని ఎలిమెంట్స్ ని చాలా స్ట్రాంగ్ గా చిత్రీకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు…ఇక ఇదిలా ఉంటే యంగ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పాటు చేసుకున్న నితిన్ వెంకీ కుడుముల డైరెక్షన్ లో చేస్తున్న రాబిన్ హుడ్ సినిమా కూడా ఇలాంటి కథాంశం తోనే తెరకెక్కుతుంది.

    మరి ఈ రెండు సినిమాలు ఒకే నేపథ్యంతో తెరకెక్కడం వల్ల ఈ రెండు సినిమాలకు భారీ ప్రమాదం వాటిల్లే అవకాశం ఏదైనా ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఒకే టైమ్ లో ఒకే స్టోరీ తో వచ్చిన కథలు చాలానే ఉన్నాయి. అయినప్పటికి వాటిలో ఉండే ట్రీట్ మెంట్ కొత్తగా ఉంటే ఏ సినిమా అయినా సరే సక్సెస్ సాధిస్తుంది అనడానికి ఇంతకుముందు చాలా సినిమాలను మనం ఉదాహరణలుగా చెప్పుకున్నాం.

    మరి మొత్తానికైతే ఈ రెండు సినిమాలు కూడా సక్సెస్ సాధించాలంటే మాత్రం రెండు స్టోరీలు గ్రిప్పింగ్ గా ఉన్నప్పటికి ట్రీట్ మెంట్ లో గాని స్క్రీన్ ప్లే లో గాని కొత్తదనం ప్రదర్శించాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఇలాగే రెండు వేరియేషన్స్ లో కనక ఈ సినిమాలు వస్తే ఈ రెండు సినిమాలు కూడా తప్పకుండా సక్సెస్ అవుతాయి. లేకపోతే మాత్రం రెండు సినిమాలకు దెబ్బ పడే అవకాశాలు ఉన్నాయంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…