Mega vs Manchu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో లెజెండరీ నటుడిగా గుర్తింపును సంపాదించుకున్న చిరంజీవి తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు… గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న ఈయన ఇప్పటికి యంగ్ హీరోలతో సైతం పోటీపడుతూ సినిమాలను చేయడం విశేషం…ఇక సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా గుర్తింపును సంపాదించుకున్న మోహన్ బాబు సైతం కొన్ని సినిమాల్లో హీరోగా చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయిన విషయం మనకు తెలిసిందే…అయితే చిరంజీవి, మోహన్ బాబు ఇద్దరూ కెరీయర్ ను ఒకేసారి స్టార్ట్ చేశారు. మొదట్లో ఇద్దరు విలన్స్ గా నటించి ఆ తర్వాత హీరోలుగా మారిన వారే కావడం విశేషం…ఇక వీళ్ళిద్దరూ కలిసి హీరోలుగా ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ లాంటి సినిమాల్లో కలిసి నటించారు. మోహన్ బాబు కి హీరోగా మంచి అవకాశాలు రాకపోవడంతో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. ఇక చిరంజీవి మాత్రం హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకుంటూ తన డాన్సులతో యాక్టింగ్ తో ప్రేక్షకులను మైమారిపింప జేశాడు. దాంతో ఒక్కసారిగా చిరంజీవి మెగాస్టార్ హోదాని అందుకోవడంతో తన ఫ్రెండ్ ఆ రేంజ్ కి వెళ్లడం ఓర్చుకోలేకపోయిన మోహన్ బాబు ఎప్పుడు చిరంజీవిని విమర్శిస్తూ వస్తున్నాడు. ఇక ఎప్పటికప్పుడు చిరంజీవి కంటే నేనే గొప్ప నటుడిని అని ప్రూవ్ చేసుకోవాలనే తాపత్రయం మోహన్ బాబు లో ఉంటుంది అది మనకు ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది…
ఇదిలా ఉంటే గత 20 సంవత్సరాల కిందట వజ్రోత్సవం పేరుతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరూ కలిసి ఒక ఈవెంట్ ని జరిపారు. ఇక ఈ ఈవెంట్లో లెజెండరీ నటుడిగా చిరంజీవికి ఒక అరుదైన గౌరవాన్ని దక్కేలా అవార్డుని ఇవ్వాలని కూడా అనుకున్నారు. కానీ ఆ ఈవెంట్ లో మోహన్ బాబు మధ్యలో కలిగించుకొని లెజెండరీ అంటే ఏంటి? ఎవరికి లెజెండరీ యాక్టర్ అవార్డు ఇవ్వాలి అంటూ ఈవెంట్లో రచ్చ రచ్చ చేశాడు.
దాంతో చిరంజీవి ఈ లెజెండరీ అవార్డు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ ఆయన ఆ అవార్డు ను క్యాన్సల్ చేశాడు. ఇక అప్పటినుంచి మెగా ఫ్యామిలీ వర్సెస్ మంచు ఫ్యామిలీ అన్నట్టుగానే వ్యవహారం నడుచుకుంటూ వస్తుంది.
ప్రతి దాంట్లో మోహన్ బాబు వేలు పెట్టి చిరంజీవిని గెలికి మరి కాంట్రవర్సీలని క్రియేట్ చేస్తూ వస్తున్నాడు. ఇక గత సంవత్సరం జరిగిన మా ఎలక్షన్స్ లో కూడా విష్ణు ప్రెసిడెంట్ గా నిలుచున్నప్పుడు ప్రకాష్ రాజ్ కి మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది. మేము ఓడిపోవాలని వాళ్ళు చూస్తున్నారు అంటూ మోహన్ బాబే ప్రచారం చేసుకున్నాడు. అయినప్పటికీ అది ఎవరు నమ్మలేదు. ఇక అప్పుడు కూడా అందరూ చిరంజీవికే సపోర్ట్ చేశారు. నిజానికి అయితే మోహన్ బాబు కావాలనే ఇలాంటి గొడవలను క్రియేట్ చేసుకుంటాడని చాలామంది చెబుతూ ఉంటారు. ఇక దాసరి నారాయణరావు చనిపోయిన తర్వాత ఇండస్ట్రీ పెద్దగా ఎవరు ఉండాలి అనే ఒక ప్రశ్న అయితే తలెత్తింది.
ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ఏ ఒక్కరు ముందుకు రావడం లేదు. అదే ఇండస్ట్రీ పెద్దగా ఒకరు ఉన్నట్లైతే వాళ్లే ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేస్తారు అనే ఉద్దేశ్యంతో చిరంజీవిని ఇండస్ట్రీ పెద్దగా ఉంచాలని కొంతమంది సినిమా ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ నటులు ఆలోచించారు. అయినప్పటికి మోహన్ బాబు మాత్రం నేను ఇండస్ట్రీ పెద్దగా ఉంటానని ముందుకు రావడంతో చిరంజీవి స్వతహాగా నేను ఇండస్ట్రీ పెద్దగా ఉండలేను అంటూ తప్పుకున్నాడు… ఇక గత సంవత్సరం వైసీపీ ప్రభుత్వం సినిమా టికెట్ల రేటు తగ్గించినప్పుడు టిక్కెట్ రేటు పెంచమని జగన్ దగ్గరికి వెళ్లి మోహన్ బాబు అడిగే సాహసం కూడా చేయలేదు. కానీ చిరంజీవి మాత్రం హీరోలందరిని వెంటేసుకొని వెళ్లి మరి సినిమా టికెట్ల రేట్లు పెంచాలని అడిగాడు… ఇది కదా ఇండస్ట్రీ పెద్ద చేయాల్సిన పని అంటూ చాలా మంది కామెంట్లు చేశారు…ఇక ఇదిలా ఉంటే నాగార్జున వాళ్ల నాన్న అయిన ఏఎన్ఆర్ పేరు మీద ‘ఏఎన్నార్ లెజెండరీ అవార్డు’ని చిరంజీవికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇక ఇండియాలో లెజెండరీ నటుడుగా గుర్తింపు పొందిన అమితాబచ్చన్ చేతుల మీదుగా ఈ అవార్డుని చిరంజీవికి ప్రధానం చేయించడం విశేషం…
ఇక ఈ ఈవెంట్లోనే చిరంజీవి మాట్లాడుతూ 20 సంవత్సరాల కిందట లెజెండరీ యాక్టర్ అవార్డుని నేను అందుకోవాలి అనుకున్నప్పుడు కొంతమంది కావాలనే కుట్ర చేసి మరి దాన్ని నేను అందుకోకుండా చేశారు.కానీ నా మిత్రుడు అయిన నాగార్జున ఈరోజు వాళ్ళ నాన్నగారి పేరు మీద ఒక అవార్డుని పెట్టి దాన్ని నాకు ప్రధానం చేయడం అనేది నిజంగా గొప్ప విషయం అంటూ నాగార్జునకి కృతజ్ఞతలు తెలియజేశాడు…ఇక చిరంజీవి ఇన్ డైరెక్ట్ గా మోహన్ బాబు మీద కామెంట్స్ చేయడంతో మరోసారి మెగా వర్సెస్ మంచు ఫ్యామిలీల మధ్య గొడవ అనేది స్టార్ట్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ రెండు ఫ్యామిలీల మధ్య తరుచూ గొడవలు జరుగుతూనే ఉంటాయి…