https://oktelugu.com/

Manmadha : మన్మధ రైట్స్ ను గీతా ఆర్ట్స్ 25 లక్షలకు తీసుకుంది…ఫైనల్ గా ఆ మూవీ ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రొడక్షన్ హౌజ్ లు కూడా భారీ రేంజ్ లో సినిమాలను నిర్మిస్తూ వాళ్లకంటు ఒక గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారు...ఇక ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ప్రొడ్యూసర్లు టాప్ ప్రొడ్యూసర్లుగా కొనసాగుతూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : November 6, 2024 / 10:38 AM IST

    Manmadha rights were taken by Geeta Arts for 25 lakhs... Do you know how much that movie collected as a final..?

    Follow us on

    Manmadha : తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న అల్లు అరవింద్ తనదైన రీతిలో సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న చాలా సినిమాలు ప్రేక్షకులను అలరించడమే కాకుండా భారీ బడ్జెట్ తో తీసే సినిమాల విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటాడనే విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఇప్పటికే ఆయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధించాయి. ఇక ఇదిలా ఉంటే 2004వ సంవత్సరంలో శింబు హీరోగా జ్యోతిక హీరోయిన్ గా వచ్చిన ‘మన్మధ’ సినిమా డబ్బింగ్ రైట్స్ ను రైట్స్ ని అల్లు అరవింద్ తీసుకున్నాడు. కేవలం 25 లక్షలతో తీసుకున్న ఈ సినిమా తెలుగులో రెండు కోట్ల కలెక్షన్లను రాబట్టింది. దాంతో అల్లు అరవింద భారీగా లాభాలను పొందడమే కాకుండా తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో పలు తమిళ్ సినిమాలను కూడా తెలుగులో డబ్ చేసిన విషయం మనకు తెలిసిందే… ఇక మొత్తానికైతే గీత బ్యానర్ నిలబెట్టడంలో అల్లు అరవింద్ తనదైన రీతిలో శ్రమించి మరి ఒక రేంజ్ లో నిలబెట్టడనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న గీతా ఆర్ట్స్ బ్యానర్ ఇప్పుడు కొంతమంది స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి సిద్ధమవుతుంది.

    మొదట్లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి హీరోలతో భారీ సినిమాలను నిర్మించిన అల్లు అరవింద్ ఇప్పుడు మాత్రం కొత్త హీరోలతో సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద బ్యానర్లలో గీత ఆర్ట్స్ కూడా ఒకటి కావడం విశేషం.

    అల్లు అరవింద్ తన కొడుకు అయిన అల్లు అర్జున్ తో కలిసి బోయపాటి శ్రీను డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయాలనే ప్రణాళికలను కూడా రూపొందించుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే వీళ్ళ కాంబోలో సరైనోడు అనే సినిమా వచ్చి భారీ విజయాన్ని సాధించింది.

    అయినప్పటికి మరొకసారి వీళ్ళ కాంబోలోనే సినిమాలు చేసి భారీ సక్సెస్ ని సాధించాలని అల్లు అరవింద్ అల్లు అర్జున్ భారీ ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా గీత ఆర్ట్స్ బ్యానర్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలను చేసి సక్సెస్ లను అందుకోవడమే కాకుండా డబ్ చేసి కూడా భారీ రేంజ్ లో సక్సెస్ లను కొట్టిన ఘనత కూడా దక్కిందనే చెప్పాలి…