Ram Charan : రామ్ చరణ్ బుచ్చి బాబు సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న మలయాళీ నటుడు…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సుకుమార్ కి చాలా మంచి క్రేజ్ ఉంది.అయితే ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా చేసి బయటకు వచ్చి సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను అందుకుంటున్న దర్శకులను మనం చూస్తూనే ఉన్నాం. వాళ్లు కూడా ఈ సినిమాలతో భారీ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు...

Written By: Gopi, Updated On : October 29, 2024 10:53 am

Malayalam actor who is playing a key role in Ram Charan Buchi Babu movie...

Follow us on

Ram Charan : సినిమా ఇండస్ట్రీకి మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగడం అనేది ప్రతి ఒక్కరిని ఆనందపడేలా చేస్తుంది. నిజానికి మెగాస్టార్ కొడుకు అయినప్పటికీ ఇప్పుడు మాత్రం మెగా పవర్ స్టార్ గా తన కంటు ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నాడు. ఇక పాన్ ఇండియాలో తన సత్తా చాటుతున్నాడు ఇక గ్లోబల్ స్టార్ గా అవతరించిన రామ్ చరణ్ ఇప్పుడు భారీ సక్సెస్ లను సాధించడానికి మన ముందుకు రాబోతున్నాడు. ఇక సంక్రాంతి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్న నేపధ్యం లో ఈ సంక్రాంతి విన్నర్ గా తను నిలవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్న సినిమాతో కూడా మరోసారి పెను సంచలనాన్ని సృష్టించడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నాడు. ఉప్పెన సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న బుచ్చిబాబు తన రెండో సినిమాను రామ్ చరణ్ తో చేయడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం అనే చెప్పాలి.. అయితే బుచ్చిబాబు వెనక సుకుమార్ ఉన్నాడు కాబట్టి రామ్ చరణ్ అంత ధీమాగా ఈ సినిమాకి కమిట్ అయినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకు సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ ఫైనల్ అయింది. తొందర్లోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్ళబోతున్నట్టుగా కూడా వార్తలయితే వస్తున్నాయి. ఇక ఇంతకు ముందే ఈ సినిమాకి సంబంధించిన పూజ కార్యక్రమాలను జరుపుకొని రెగ్యూలర్ షూట్ కి వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు…

ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మలయాళ నటుడు అయిన పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి…ఇక ఇప్పటికే సలార్ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్ గా నటించిన పృథ్విరాజ్ కుమారన్ ఈ సినిమాలో కూడా భారీ విలనిజాన్ని పండించడానికి సిద్ధమవుతున్నాడు.

ఇక బుచ్చిబాబు ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా తనకు చాలా కీలకమనే చెప్పాలి. మరి పృధ్వీ రాజ్ సుకుమారన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడా లేదా ఇంకా ఏదైనా క్యారెక్టర్ లో నటిస్తున్నాడా అనే విషయాలు తెలియాలంటే బుచ్చిబాబు ఈ సినిమా గురించిన అప్డేట్స్ ఇవ్వాల్సిన అవసరమైతే ఉంది.

మరి సోషల్ మీడియా మొత్తంలో ఈ న్యూస్ వైరల్ గా మారినప్పటికి ఈ సినిమా నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్స్ అయితే రాలేదు. కాబట్టి ఈ న్యూస్ నిజమా అబద్దమా అనేది తెలియడం లేదు…