https://oktelugu.com/

Devara & Koratala Siva : దేవర తో ఢీలాపడ్డ కొరటాల శివ…ఆయనకి స్టార్ హీరోలు డేట్స్ ఇవ్వడం కష్టమేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తమదైన రీతిలో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న చాలామంది హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల మీద కన్నేశారు... అలాగే కొంతమంది స్టార్ డైరెక్టర్లు కూడా పాన్ ఇండియా సినిమాలను చేస్తున్నప్పటికి వాళ్లకు సరైన సక్సెస్ మాత్రం దక్కడం లేదు...

Written By:
  • Gopi
  • , Updated On : November 9, 2024 / 08:23 AM IST

    Koratala Siva who clashed with Devara...is it difficult for star heroes to give him dates..?

    Follow us on

    Devara & Koratala Siva : సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు కొరటాల శివ. కెరియర్ మొదట్లో ఈయన చేసిన సినిమాలు మంచి విజయాలను సాధించాయి. ఇక ఆచార్య సినిమాతో డీలా పడ్డ కొరటాల శివ ఆ తర్వాత చేసిన దేవర సినిమాతో మరోసారి మంచి సక్సెస్ ని సాధించినప్పటికి ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబట్టడంలో చాలా వరకు ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా కొరటాల శివ మీద జూనియర్ ఎన్టీయార్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టలేకపోయాడు. దేవర సినిమా లాంగ్ రన్ లో దాదాపు 600 కోట్ల వరకు కలెక్షన్స్ రాబడుతుందని జూనియర్ ఎన్టీఆర్ భారీ ప్రణాళికలను రూపొందించుకున్నప్పటికి ఈ సినిమా కేవలం 300 కోట్ల కలెక్షన్లను మాత్రమే రాబట్టడంతో పాన్ ఇండియాలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా కొరటాల శివ కి స్టార్ హీరోలను డైరెక్షన్ చేసే సత్తా రోజు రోజుకి తగ్గిపోతుందని చాలామంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఆయన రాసుకునే సినిమా స్టోరీలు కూడా చాలా రొటీన్ ఫార్ములా లో ఉంటున్నాయని మరి కొంతమంది విమర్శకులు సైతం అతని మీద విమర్శల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా కొరటాల లాంటి ఒక స్టార్ డైరెక్టర్ ఇప్పుడు చాలా డైలమాలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

    ఇక ఇప్పుడు ఆయన ఎవరితో సినిమా చేస్తే ఆ సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది? ఎవరు తనకు అవకాశాన్ని ఇస్తారు? అనే విధంగా తను కొంతమంది స్టార్ హీరోలను టార్గెట్ చేసుకొని వాళ్ళ కోసం కథలను కూడా రెడీ చేసి ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.

    ఇక ఏది ఏమైనా కూడా కొరటాల శివ లాంటి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కి కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అవకాశం అయితే ఇవ్వలేకపోతున్నారు. దాంతో ఆయన తమిళ్ గాని లేదంటే మలయాళం హీరోలతో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

    మరి కొరటాల శివ దేవర విషయంలో చాలావరకు రాంగ్ స్టెప్స్ వేశారు అంటూ ఎన్టీఆర్ అభిమానులు కూడా కొంతవరకు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా కొరటాల శివకి ప్రస్తుతం కాలమైతే కలిసి రావడం లేదనే చెప్పాలి. మరి తను అనుకున్న గోల్ ని రీచ్ అవ్వాలంటే అంతకు మించి సినిమాలను చేయాల్సిన అవసరమైతే ఉంది. చూడాలి మరి ఈ సినిమాలతో ఆయన ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది…