https://oktelugu.com/

Kiran abbavaraṁ : కిరణ్ అబ్బవరం క సినిమాతో 100 కోట్లు కొట్టబోతున్నాడా..?

సినిమా ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు కిరణ్ అబ్బవరం...ఆయన యంగ్ హీరోలందరిలో చాలా ప్రత్యేకంగా నిలుస్తాడనే చెప్పాలి. మిగతా హీరోలతో పోటీ లేకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకొని ఆ జానర్స్ లోనే సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇక వాటిలో కొన్ని సినిమాలు సక్సెస్ అయితే మరికొన్ని సినిమాలు మాత్రం అతనికి మంచి విజయాన్ని సాధించి పెట్టాయనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : November 2, 2024 / 12:44 PM IST

    Kiran abbavaram

    Follow us on

    దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన క సినిమా అంచనా వేసిన దాని కంటే కూడా భారీ రెస్పాన్స్ తో పెద్ద విజయాన్ని సాధించే విధంగా ముందుకు దూసుకెళ్తుంది. ఇక కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన ఈ సినిమా మీద మొదట్లో ఎవ్వరికి పెద్దగా అంచనాలైతే లేవు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం ఇచ్చిన స్పీచ్ తో ఒక్కసారిగా సినిమా మీద భారీ అంచనాలైతే పెరిగిపోయాయి…ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ప్రీమియర్స్ ని చూసిన వెంటనే ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతుంది అంటూ చాలామంది ఈ సినిమా గురించి కామెంట్లైతే చేశారు. ఇక మొత్తానికైతే ఈ సినిమాను సక్సెస్ ఫుల్ సినిమాగా ముందుకు తీసుకెళ్లడంలో ప్రేక్షకులు చాలా కీలక పాత్ర వహించారు. ఇక ఈ సినిమా ఈ దీపావళికి భారీ బ్లాక్ బాస్టర్ సక్సెస్ గా నిలిచిందనే చెప్పాలి. మరి ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం పాన్ ఇండియా స్టార్ గా కూడా ఎదిగే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఈ సినిమా ఇండియా వైడ్ గా లాంగ్ రన్ లో 100 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయంటూ ట్రేడ్ పండితులు సైతం ఇప్పటికే లెక్కలను వేస్తున్నారు. నిజానికి వరుసగా డిజాస్టర్ సినిమాలను చేసుకుంటూ వచ్చిన కిరణ్ అబ్బవరం ఒక్కసారిగా తన పంథా ను మార్చుకొని డిఫరెంట్ సినిమాను చేసి సక్సెస్ సాధించడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.

    ఇక ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడంలో ఆయన చాలా వరకు సక్సెస్ అయ్యాడు. అందుకోసమే ఆయన ఈ సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఏది ఏమైనా కూడా కిరణ్ అబ్బవరం లాంటి ఒక యంగ్ హీరో సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాలను చేయడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.

    ఇక దీని గురించి కిరణ్ మాట్లాడుతూ నాకు చాలా మంది అండగా నిలవడంతోనే నేను ఈ ఘనతను సాధించానంటే ఆయన ఒక సందర్భంలో తెలియజేయడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా క సినిమా 100 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టింది అంటే మాత్రం ఇప్పుడున్న చాలామంది హీరోల కంటే కిరణ్ అబ్బవరం ముందు వరుసలోకి వెళ్ళిపోతాడనే చెప్పాలి…

    ఇక మొత్తానికైతే ఈ హీరో తన స్టామినా ఏంటో చాటుకున్నాడు. మరి మిగతా హీరోల నుంచి ఎదురయ్యే పోటీని కూడా తట్టుకోని నిలబడగలిగితే ఈయన కూడా హీరోగా తొందర్లోనే మంచి గుర్తింపును సంపాదించుకుంటాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…