https://oktelugu.com/

Lokesh Kanakaraj & King Nagarjuna : లోకేష్ కనకరాజు మీద కోపంతో ఉన్న కింగ్ నాగార్జున…కారణం ఏంటి..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలో నాగార్జున లాంటి నటుడు ఇప్పుడు వైవిద్యభరితమైన పాత్రలను ఎంచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు...మరి దీనికి సంబంధించిన ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంటూ మంచి కథ దొరికితే ఎలాంటి క్యారెక్టర్ లో అయిన సరే నటించడానికి సిద్ధం అవుతున్నాడు...

Written By:
  • Gopi
  • , Updated On : November 2, 2024 / 09:19 AM IST

    King Nagarjuna who is angry with Lokesh Kanakaraj...what is the reason..?

    Follow us on

    Lokesh Kanakaraj & King Nagarjuna : తెలుగు సినిమా ఇండస్ట్రీలో కింగ్ నాగార్జున కి చాలా ప్రత్యేకమైన గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని కూడా క్రియేట్ చేసుకున్నాడు. ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు కొడుకుగా ఇండస్ట్రీకి వచ్చిన నాగార్జున అతి తక్కువ సమయంలోనే కింగ్ గా తన పేరును సుస్థిరం చేసుకున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక మార్కెట్ ని క్రియేట్ చేసుకోవడంలో నాగార్జున సూపర్ సక్సెస్ అయ్యాడు ఇక ఆయన జానర్స్ సంబంధం లేకుండా డిఫరెంట్ తరహా సినిమాలను చేస్తూనే ఆయన దాదాపు 40 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతూనే వస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఆయనలాంటి హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండటం నిజంగా మన ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. ఎందుకు అంటే చాలామంది హీరోలు మూస ధోరణిలో సినిమాలు చేస్తున్న సమయంలో ఆయన ఎక్స్పరిమెంట్లను చేసి సినిమా స్థాయిని పెంచడమే కాకుండా ఆయన తనకంటూ ఒక భారీ మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు…ఇక ఏది ఏమైనా కూడా ఆయనను మించిన నటుడు మరోకరు లేరనేంతల గుర్తింపు ను సంపాదించుకోవడంలో నాగార్జున చాలావరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి… ఇక ఏది ఏమైనా కూడా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో నాగార్జున చేస్తున్న కూలీ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో నాగార్జున విలన్ గా నటించడం విశేషం…ఇక ఇప్పటివరకు ఆయన ఏ సినిమాలో కూడా విలనటించిన దాఖలాలు అయితే లేవు. మరి మొదటిసారి ఈ సినిమాలో నటించబోతున్నాడనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి.

    ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ లోకేష్ కనకరాజు నాగార్జునకి తన క్యారెక్టర్ గురించి చాలా హై లెవెల్ లో చెప్పాడట… కానీ ఇప్పుడు సినిమాను తెరకెక్కించే సమయంలో మాత్రం చాలా లో లెవెల్లో తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆ విషయంలోనే నాగార్జున కొంతవరకు లోకేష్ కనకరాజ్ మీద కోపంతో ఉన్నట్టుగా తెలుస్తోంది.

    మరి తన అనుకున్నట్టుగానే ఈ సినిమాని లోకేష్ తెరకెక్కిస్తున్నాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఈ సినిమాతో తనకంటూ ఒక సపరేట్ గుర్తింపును సంపాదించుకుంటే మాత్రం నాగార్జున ఇకమీదట వైవిధ్యభరితమైన పాత్రలను చేయడానికి సిద్ధంగా ఉంటాడనే చెప్పాలి.

    ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో తనకంటూ భారీ గుర్తింపును సంపాదించుకోబోతున్న నాగార్జున ఇక మీదట హీరో గా చేస్తూనే, విలన్ గా కూడా చేయబోతున్నట్టుగా వార్తలైతే వినిపిస్తున్నాయి.