https://oktelugu.com/

Kangua : ‘కంగువా’ సినిమా యూఎస్ఏ రివ్యూ..

ప్రస్తుతం సూర్య తనను తాను పాన్ ఇండియాలో స్టార్ హీరోగా నిలబెట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఆయన చేసిన కంగువా సినిమా రేపు రిలీజ్ చేస్తున్నారు. మరి దానికి సంబంధించిన విశేషాలు ఏంటి ఈ సినిమా ఎలా ఉంది సూర్యకి భారీ సక్సెస్ ని కట్టబెట్టి పాన్ ఇండియాలో స్టార్ హీరో నిలబెట్టిందా లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

Written By:
  • Gopi
  • , Updated On : November 13, 2024 / 08:39 AM IST

    'Kangua' Movie USA Review..

    Follow us on

    Kangua : ఇక ఈ సినిమాని అమెరికాలో చూసిన ప్రేక్షకులు కొంతమంది ఈ సినిమా కథ గురించి తెలియజేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా ప్రాచీన కలానికి, ఆధునిక కాలానికి మధ్య ఒక జరుగుతున్న ఒక సంఘర్షణగా నిలువబోతుంది…ఇక ఈ సినిమాలో సూర్య తన వాళ్లను కాపాడుకోవడానికి అప్పుడు ఇప్పుడు ఎలాంటి ప్రయత్నం చేశాడు వీళ్ళ మధ్య ఏం జరిగిందనే విషయాలను తెలియజేశారట… ఈ సినిమా చివర్లో సూర్య ఏం చేశాడు తన వాళ్ళను ఎలా కాపాడుకున్నాడు అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే…

    ఇక విశ్లేషణ విషయాన్ని వస్తే ఈ సినిమాకి శివ డైరెక్షన్ చాలా అద్భుతంగా ఉందని ఆయన ఇంతకు ముందు చేసిన అన్ని సినిమాల కంటే చాలా డిఫరెంట్ గా ఉందని అలాగే ఇప్పుడు కూడా తనదైన రీతిలో నటించి మెప్పించే ప్రయత్నం అయితే చేశారు. మరి ఈ సినిమా మొదట్లో కొంతవరకు స్లోగా అనిపించినప్పటికి సినిమా కథలోకి వెళ్లే కొద్ది ఒక్కొక్క మెట్టు పైకెక్కుతూ భారీ ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తున్నాడు కాబట్టి ఇలాంటి సమయం లో యూఎస్ఏ లో ఉన్న సూర్య అభిమానులు ఈ సినిమాతో సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు. అయితే ఈ సినిమాకి మ్యూజిక్ కూడా చాలా బాగుందట ప్రేక్షకులు ఈ సినిమా చూస్తే మాత్రం చూసినంత సేపు ఎంజాయ్ చేస్తారు అంటూ చెబుతున్నారు…

    ఇక ఆర్టిస్టుల విషయానికి వస్తే సూర్య మాత్రం తమదైన రీతిలో తమ సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్ళే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా సూర్య అయితే రెండు గెటప్పుల్లో తనదైన రీతిలో నటించి మెప్పించడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడంలో సూర్య మొదటి నుంచి కూడా చాలా వైవిధ్యాన్ని చూపిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఈ సినిమాలో కూడా అదే వైవిధ్యాన్ని కనబరిచినట్టుగా కనిపిస్తుంది. ఇక మిగతా ఆర్టిస్టులు కూడా వాళ్ల పర్ఫామెన్స్ ను అందిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకుడిని ఎలా అలరిస్తుంది. సక్సెస్ అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…

    ఇక ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంటే మాత్రం పాన్ ఇండియాలో సూర్య కూడా టాప్ హీరోగా ఎదుగుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఈ సినిమా రిలీజ్ కి మరి కొద్ది గంటల సమయం మాత్రమే ఉన్న నేపధ్యంలో ఈ సినిమా సూపర్ సక్సెస్ ను సాధిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది