https://oktelugu.com/

KA Movie Kiran : హిట్టు కొడుతున్నాం అని చెప్పి మరీ కొట్టాడంటే ఆడు మగాడ్రా బుజ్జీ…

సినిమా ఇండస్ట్రీ అనగానే అందరికీ రంగుల ప్రపంచం మాత్రమే కనిపిస్తుంది. కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే మాత్రం చాలా పెద్ద టాస్క్ అనే చెప్పాలి. అనుకున్న అవకాశాలు రావు వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉండదు...అన్ని రకాలుగా ఇక్కడ ఇబ్బంది పడాల్సి ఉంటుంది...

Written By:
  • Gopi
  • , Updated On : November 1, 2024 / 10:47 AM IST

    If you say that you are going to hit and hit too much, play magadra buzzy...

    Follow us on

    KA Movie Kiran : రాజా వారు రాణి గారు సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నాడు కిరణ్ అబ్బవరం…ఇక ఆ తర్వాత చేసిన సినిమాలు అడపాదడపా సక్సెస్ లను సాధిస్తూ వచ్చాయి. ఇక మొత్తానికైతే సినిమా ఇండస్ట్రీలో ఎవరి సపోర్టు లేకుండా వచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్న నటుడు కిరణ్ అబ్బవరం కావడం విశేషం…ఇక మొత్తానికైతే ఆయన చేసిన ‘క ‘ సినిమా మంచి విజయాన్ని సాధించింది. నిజానికి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే ఆయన చాలా స్ట్రాంగ్ గా చెప్పాడు. ఈ సినిమాతో తను సూపర్ సక్సెస్ ని సాధించబోతున్నాడని ఇక ఈ సినిమా క్లైమాక్స్ ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు రాలేదని కూడా చెప్పాడు. అలా కనక వచ్చినట్టైతే తను ఇక మీదట సినిమాలు చేయనని చాలా స్ట్రాంగ్ గా చెప్పాడు. ఇక ఈ స్పీచ్ చూసిన తర్వాత అందరూ సినిమా రిలీజ్ కి ముందు ఇలాగే చెబుతారు అంటూ కిరణ్ అబ్బవరం మాటల్ని కొట్టి పారేశారు. కానీ రిలీజ్ అయిన తర్వాత చూస్తే మాత్రం కిరణ్ అబ్బవరం చెప్పిన మాటల్లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదని అందరూ అతన్ని ప్రశంసిస్తున్నారు. నిజానికి ఈ సినిమా క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉందనే చెప్పాలి…ఇక ఈ సినిమాకి సక్సెస్ టాక్ రాగానే కిరణ్ అబ్బవరం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన మాటలని సోషల్ మీడియా మొత్తంలో అతనికి సపోర్ట్ చేస్తుంది.

    ఇక ఎవరి సపోర్టు లేకుండా ఎదిగిన ఒక హీరో ప్రస్తుతం స్టార్ హీరో రేంజ్ లో ముందుకు సాగుతూ ఉండడం నిజంగా గొప్ప విషయం అంటూ అతన్ని అందరూ సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా కిరణ్ అబ్బవరం లాంటి ఒక నటుడు అంచలంచెలు ఎదుగుతూ ఉండడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.

    ఇక దాంతోపాటుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే మనం సక్సెస్ కొట్టబోతున్నామని చాలా స్ట్రాంగ్ గా చెప్పాడు. ఇక కిరణ్ అబ్బవరం మామూలుడు కాదు. ఈయనకు ఇండస్ట్రీలో చాలా మంచి కెరియర్ ఉంది. అని చాలామంది సినీ మేధావులు సైతం అతన్ని ప్రశంసించడం గొప్ప విషయం…

    ఇక ఏది ఏమైనా కూడా మనం  సాధించగలమనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నప్పుడు మనల్ని ఎవ్వరూ ఆపలేరని చెప్పడానికి కిరణ్ అబ్బవరం ను మనం ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఇక ఎంతమంది తనని ట్రోల్ చేసినా కూడా అవేవీ పట్టించుకోకుండా ఆయన దృఢ సంకల్పంతో ముందుకు సాగాడు కాబట్టి ఈరోజు సక్సెస్ ని అందుకున్నాడు…