https://oktelugu.com/

Arjun Reddy & Game Changer : ‘అర్జున్ రెడ్డి’ కి ‘గేమ్ చేంజర్’ సినిమాతో ఉన్న లింక్ అదేనా..? శంకర్ ప్లాన్ వర్కౌట్ అయితే వసూళ్ల సునామీనే!

#RRR వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ చేంజర్' చిత్రం కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో మన అందరికీ తెలిసిందే. శంకర్ లాంటి డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా చేస్తున్నాడు అన్నప్పుడే, ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు ఆకాశాన్ని అంటాయి.

Written By:
  • Vicky
  • , Updated On : November 12, 2024 / 05:13 PM IST

    Is this the link of 'Arjun Reddy' with the movie 'Game Changer'? Shankar's plan is a workout but a tsunami of collections!

    Follow us on

    Arjun Reddy & Game Changer : #RRR వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో మన అందరికీ తెలిసిందే. శంకర్ లాంటి డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా చేస్తున్నాడు అన్నప్పుడే, ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. కానీ షూటింగ్ ఆలస్యం అవుతూ వెళ్లడం వల్ల హైప్ కాస్త తగ్గింది. దానికి తోడు శంకర్ దర్శకత్వం లో ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ఇండియన్ 2’ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడంతో రామ్ చరణ్ అభిమానులు ‘గేమ్ చేంజర్’ పై ఆశలు వదిలేసుకున్నారు. అయితే ఈ సినిమా నుండి విడుదలైన రెండు పాటలు హిట్ అవ్వడం, అదే విధంగా మొన్న వచ్చినటువంటి టీజర్ కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా పై అంచనాలు మళ్ళీ భారీగా పెరిగాయి. శంకర్ మార్క్ కమర్షియల్ సినిమా అంటే ఎలా ఉంటుందని ఆడియన్స్ ఊహించుకుంటారో, అలాగే ఉన్నట్టుగా టీజర్ ని చూస్తే అర్థం అవుతుంది.

    అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ క్యారక్టరైజేషన్ ‘అర్జున్ రెడ్డి’, ‘ఎనిమల్’ సినిమాల తరహాలో ఉంటుందని తెలుస్తుంది. ఈ రెండు సినిమాల్లో హీరోల క్యారెక్టర్స్ ఎంత అగ్రెసివ్ గా ఉంటాయో అందరికీ తెలిసిందే. అర్జున్ రెడ్డి క్యారక్టర్ కి అయితే కోపాన్ని తగ్గించుకోవడం, కంట్రోల్ లో పెట్టుకోవడం అసలు తెలియదు. ‘గేమ్ చేంజర్’ చిత్రంలో కూడా హీరో క్యారక్టర్ అదే విధంగా ఉంటుందని మనకి టీజర్ ని చూస్తేనే అర్థం అవుతుంది. ఒక స్టూడెంట్ కి, లేదా ఒక సాధారణ మనిషికి కోపం అదుపులో ఉండకపోవడం వల్ల ఎలాంటి నష్టం ఉండదు. కానీ IAS లాంటి ప్రభుత్వ అధికారికి కోపం అదుపులో పెట్టుకోవడం రాకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురు అవుతాయో ‘గేమ్ చేంజర్’ చిత్రంలో చూడొచ్చు అని టీజర్ ద్వారా ఆడియన్స్ కి చెప్పుకొచ్చాడు శంకర్.

    విద్యార్థి దశ నుండే రామ్ చరణ్ కి ఈ సమస్య ఉంది. ఆ సమస్య అతన్ని జీవితంలో ఎటువైపు అడుగులు వేయించింది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇందులో రామ్ చరణ్ స్టూడెంట్ గా, IAS ఆఫీసర్ గా, రాజకీయ నాయకుడిగా కనిపించనున్నాడు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రామ్ చరణ్ క్యారక్టర్ కూడా సినిమాకి హైలైట్ అవ్వబోతుందట. రామ్ చరణ్ అభిమానులను సంతృప్తి పరుస్తూ శంకర్ మార్క్ కమర్షియల్ ఎలిమెంట్స్, సోషల్ ఎలిమెంట్స్ ని జోడించి ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారని,ఈ సినిమాతో సంక్రాంతికి శంకర్ విశ్వరూపం చూస్తారంటూ సోషల్ మీడియా లో అభిమానులు చెప్పుకుంటున్నారు, మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మరో రెండు నెలలు ఎదురు చూడాలి. వచ్చే నెల రెండవ వారంలో ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారు మేకర్స్.