Senior heroes : సీనియర్ హీరోల్లో ఈ ఒక్కటి మిస్ అవుతుందా..?ఎందుకు వాళ్ళు ఒకే ఫార్మాట్ లో వెళ్తున్నారు..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మన సీనియర్ హీరోలందరూ భారీ సక్సెస్ లను సాధించడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప మంచి సినిమాలు చేయడంలో చాలా వరకు విఫలమవుతున్నారనే చెప్పాలి. మరి ఈ వైఖరికి చెక్ పెడుతూ కొత్త కథలతో సినిమాలు చేస్తే బాగుంటుంది అనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న...
Senior heroes : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోలుగా గుర్తింపును సంపాదించుకున్న చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి నటులు తమదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకు వెళ్తున్నారు. ఇక ఒకప్పుడు వీళ్ళు చేసిన సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. కానీ ఈ మధ్యకాలంలో వీళ్ళ సినిమాలు ప్రేక్షకులను అలరించడంలో ఫెయిల్ అయిపోతున్నాయనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా వాళ్ళు కూడా వాళ్ళ పంథాను మార్చుకొని కొత్త జానర్ లో సినిమాలను చేయాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇప్పటికే నాగార్జున విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు రకాల పాత్రలను పోషిస్తూ ముందుకు సాగుతున్నప్పటికి మిగిలిన ముగ్గురు హీరోలు మాత్రం ఎప్పుడూ కమర్షియల్ సినిమాలను నమ్ముకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇప్పటికైనా వాళ్ళని వాళ్ళు మార్చుకొని ముందుకు సాగితే తప్ప సక్సెస్ లు అనేవి రావనే చెప్పాలి. అందువల్ల వాళ్లకి కలెక్షన్లు భారీగా రాకపోతుండడం ఒకటే కాదు. సినిమాకి భారీగా నష్టాలను కూడా మిగిల్చిన వాళ్ళు అవుతున్నారు. ఇక రీసెంట్ గా చిరంజీవి చేసిన భోళా శంకర్ సినిమా కమర్షియల్ సినిమాగా వచ్చి ఏ మాత్రం సత్తాను చాటుకోలేక ఢీలా పడిపోయింది.
ఇక బాలకృష్ణ భగవంతు కేసరి సినిమా కూడా రొటీన్ కమర్షియల్ సినిమా లాగానే ఉంది. నాగార్జున చేసిన నా సామి రంగ సినిమా అయితే మరి దారుణంగా ఉందనే చెప్పాలి. వెంకటేష్ సైంధవ్ సినిమా డిజాస్టర్ ని మూట గట్టుకుంది. వీళ్ళందరూ చేసిన గత సినిమాలు ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయాయి. అయినప్పటికి వాళ్లు ఇప్పటికి వాళ్ళ వైఖరిని మార్చుకోకుండా మళ్ళీ రొటీన్ సినిమాలను చేయడానికి సిద్ధమవుతున్నారు.
ఈ ఏజ్ లో కూడా కమర్షియల్ సినిమాలను చేస్తూ లవ్ స్టోరీస్ ని డ్యూయెట్ సాంగ్స్ ని పాడుతూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇప్పుడు కూడా రోటీన్ సినిమాలు కాకుండా, డిఫరెంట్ అటెంప్ట్ లు చేయాలి. ఇక వీలైతే ఆర్ట్ సినిమాలు చేస్తే బాగుంటుంది కదా అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా మలయాళ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలతో పోలుస్తూ మన హీరోలను తక్కువ చేసి మాట్లాడుతుండడం అనేది చాలామందికి నచ్చడం లేదు. కానీ మన హీరోలు కూడా వాళ్ళని వాళ్ళు మార్చుకొని మంచి సినిమాలు చేస్తే బాగుంటుంది అంటూ చాలామంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…