https://oktelugu.com/

Allu Arjun & Sandeep Vanga : అల్లు అర్జున్ సందీప్ వంగ సినిమా ఉన్నట్టేనా..? బన్నీ నుంచి ఎలాంటి అప్డేట్ రావడం లేదు…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరూ చేయలేని సినిమాలను చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ...ఈ సినిమాలతోనే ఆయనకంటూ ఒక స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం స్టార్ హీరోలను సైతం డైరెక్షన్ చేసే స్థాయికి ఎదిగాడు... ఇప్పుడు ఆయన ప్రభాస్ ను హీరోగా పెట్టి ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథను సినిమాగా చేయబోతున్నాడు... ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా భారీ లెవెల్లో వర్కౌట్ అయ్యే విధంగానే కనిపిస్తుంది...

Written By:
  • Gopi
  • , Updated On : November 2, 2024 / 09:52 AM IST

    Is there an Allu Arjun Sandeep Vanga movie? No update coming from Bunny...

    Follow us on

    Allu Arjun & Sandeep Vanga : సినిమా అనేది ప్రస్తుతం ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ గా మారిపోయింది. ఎవరు ఏ వృత్తిలో ఉన్న కూడా ఒక కొత్త సినిమా రిలీజ్ అయింది అంటే మాత్రం ప్రతి ఒక్కరు ఆ సినిమాను చూడడానికి అమితమైన ఇష్టాన్ని చూపిస్తున్నారు. నిజానికి ఈ సినిమాతో ప్రేక్షకుల్లో ఉన్న ఇబ్బందులను పోగొట్టుకోవడమే కాకుండా వాళ్ళని వాళ్ళు రిఫ్రెష్ చేసుకోవడానికి సినిమాలనేవి చాలావరకు బల్లలు యూజ్ అవుతున్నాయనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ ఒక స్టామినాని ఏర్పాటు చేసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ… ఇక ప్రస్తుతం ఆయన వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. రన్బీర్ కపూర్ తో చేసిన అనిమల్ సినిమా 900 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టడంతో ఒక్కసారిగా పాన్ ఇండియాలో ఆయన పేరు మారు మ్రోగిపోతుంది. ఇక తనకంటూ ఉన్న ఐడెంటిటి ని కాపాడుకోవడానికి సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఇది కూడా బోల్డ్ కంటెంట్ తో చేస్తున్న సినిమా కావడం వల్ల ఈ సినిమా మీద కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. నిజానికి ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో ఏదో ఒక వైవిధ్యాన్ని చూపిస్తూ ఉంటాడు.

    అందువల్లే ఆయన మీద కొంతమంది ఎన్ని కామెంట్లు చేసినా కూడా అభిమానులు మాత్రం వాటిని పట్టించుకోకుండా ఆయన సినిమాల కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రతి సినిమా విషయంలో ఆయన తీసుకునే జాగ్రత్తలు చాలా కేర్ ఫుల్ గా ఉంటాయనే చెప్పాలి. అందువల్లే ఆయన సినిమాలను చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి మరి చేస్తూ ఉంటాడు.

    ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ సినిమా తర్వాత ఆయన అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. మరి ఆ సినిమా ఉంటుందా లేదా అనే దానిమీద ఇప్పుడు సరైన అభిప్రాయాలైతే రావడం లేదు. నిజానికి అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియాలో తన విజయకేతనాన్ని ఎగరవేయాలని చూస్తున్నాడు.

    ఇక ఆ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే మాత్రం పాన్ ఇండియాలో అల్లు అర్జున్ ని మించిన నటుడు మరొకరు ఉండరనేది వాస్తవం. కాబట్టి అప్పుడు ఆయన సందీప్ రెడ్డి వంగతో సినిమా చేయగలుగుతాడా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది…