https://oktelugu.com/

Rajamouli : రాజమౌళి బాహుబలి సినిమా తీయడానికి కారణం ఆ స్టార్ హీరోనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్లు ఉన్నప్పటికి రాజమౌళి లాంటి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న దర్శకులు మాత్రం ఎవరూ లేరు. ఆయన తెలుగులోనే కాదు ఇండియా మొత్తంలో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక సినిమా కోసం తన ప్రాణం పెట్టి వర్క్ చేయడంలో రాజమౌళి ముందు స్థానంలో ఉంటాడు...అందుకే ఆయనకు ఇప్పటివరకు ఒక ఫెయిల్యూర్ కూడా లేదు...

Written By:
  • Gopi
  • , Updated On : November 11, 2024 / 08:33 AM IST

    Is that star hero the reason why Rajamouli made Baahubali?

    Follow us on

    Rajamouli : స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన రాజమౌళి..ఆ సినిమా సక్సెస్ తో ఆ తర్వాత చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాడు. ఇక మొత్తం మాస్ సినిమాలతోనే ప్రేక్షకులను అలరించిన ఆయన ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమాతో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించాడనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే మగధీర సినిమాతో మొదటిసారి తెలుగు సినిమా ఇండస్ట్రీలో 100 కోట్ల కలెక్షన్లు రాబట్టిన ఏకైక దర్శకుడిగా కూడా ఆయన చరిత్రలో నిలిచాడు. ఇక ఆయన లాంటి దర్శకుడు ఇండస్ట్రీలో మరొకరు ఉండరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అయితే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న హీరోలు కేవలం తెలుగుకి మాత్రమే పరిమితమవుతున్నారనే ఉద్దేశ్యంతో రాజమౌళి మిగిలిన భాషల్లోకి కూడా మన హీరోలను పంపించాలనే ఒకే ఒక కాన్సెప్ట్ తో పాన్ ఇండియా సినిమా చేయాలని అనుకున్నాడట. అయితే దానికి స్ఫూర్తినిచ్చిన హీరో ఎవరు అనేది కూడా రీసెంట్ గా రాజమౌళి తెలియజేయడం విశేషం… ఇక ఆయనకు ఈ విషయంలో స్ఫూర్తినిచ్చిన హీరో సూర్య… తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన సూర్య తెలుగులో చాలా సినిమాలను రిలీజ్ చేసి తనకంటూ ఒక ఐడెంటిటి ని ఏర్పాటు చేసుకున్నాడు. దాంతో రాజమౌళి కూడా మన హీరోలు ఎందుకు ఇతర లాంగ్వేజ్ ల్లో సినిమాలు చేయకూడదంటూ ప్రొడ్యూసర్ల తో ఎప్పుడు మాట్లాడేవాడట… సూర్య వల్లే రాజమౌళి పాన్ ఇండియా సినిమా చేయాలని అనుకున్నాడు.

    కాబట్టి అతనిలానే మన హీరోలు కూడా ఇతర భాషల్లో రాణించాలని అక్కడ మన సత్తా చూపించాలని ఏకైక ఉద్దేశ్యంతో ఆయన బాహుబలి సినిమా చేశానని రీసెంట్ గా కంగువా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పడం విశేషం.

    ఇక ఏది ఏమైనప్పటికి రాజమౌళి తో సినిమా చేస్తున్నాం అంటే ఆ సినిమా ప్రొడ్యూసర్లు గానీ, హీరోలు గానీ వాళ్ల గుండెల మీద చేయి వేసుకొని భయం లేకుండా ముందుకు నడవచ్చు. అంతటి కాన్ఫిడెంట్ ను ఇచ్చిన దర్శకుడు రాజమౌళి… ఆయన చేసిన అన్ని సినిమాలు ఇప్పటివరకు విజయాలను సాధించాయి అంటే ఆయన ఒక సినిమా మీద ఎంత డెడికేటెడ్ గా వర్క్ చేస్తాడో మనం చాలా క్లియర్ కట్ గా తెలుసుకోవచ్చు…

    ఇక మొత్తానికైతే రాబోయే సినిమాలతో కూడా పెను ప్రభంజనాలను సృష్టించడానికి రాజమౌళి రెడీ అవుతున్నాడు… చూడాలి మరి ఇకమీదట ఆయన ఎలాంటి సినిమాలు చేస్తాడు వాటి ద్వారా ప్రేక్షకులను ఎలా ఇంప్రెస్ చేస్తాడు అనేది…