https://oktelugu.com/

Sandeep Reddy Vanga & Rajamouli : సందీప్ రెడ్డి వంగ కథను రాజమౌళి డైరెక్షన్ చేయబోతున్నారా..? ఇదెక్కడి మెంటల్ మాస్ స్టోరీ సామి…

తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయి అనేది రోజురోజుకు పెరుగుతూ పోతుంది. నిజానికి ఒకప్పుడు తెలుగులో అంత మంచి కథలు రావని విమర్శించిన చాలామంది ఇప్పుడు మన దగ్గరకి వస్తున్న సినిమాలను చూస్తూ ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఇక సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాతో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించాడు. అప్పటివరకు లేని విధంగా 30 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రను మార్చేసిన దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు...

Written By:
  • Gopi
  • , Updated On : November 1, 2024 / 05:50 PM IST

    Is Rajamouli going to direct Sandeep Reddy's Vanga story..? Here is the mental mass story Sami...

    Follow us on

    Sandeep Reddy Vanga & Rajamouli : అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ… ఇక ఈ సినిమా ఇచ్చిన ఇమేజ్ తో ఆయన ఒక్కసారిగా బాలీవుడ్ కి వెళ్లి అక్కడ ఈ సినిమాని ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేశాడు. అక్కడ కూడా భారీ విజయాన్ని సాధించిన ఈ సినిమా ఆయనకు ఎనలేని గుర్తింపును తీసుకొచ్చింది. ఇక ఆ తర్వాత రన్బీర్ కపూర్ ని హీరోగా పెట్టి చేసిన ‘అనిమల్ ‘ సినిమా బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కినప్పటికి ఆయనకు ఒక భారీ గుర్తింపును తీసుకొచ్చి పెట్టింది. ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక వైవిధ్యమైన కథాంశాన్ని ఎంచుకొని సినిమాగా చేస్తున్న ఆయన ఇప్పుడు ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ సక్సెస్ సాధిస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన రాసుకున్న ఒక కథతో రాజమౌళి సినిమా చేయబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. నిజానికి సందీప్ రెడ్డి వంగ కథకు రాజమౌళికి అసలు సెట్ అవ్వదు. మరి సందీప్ వంగ కథని ఆయన డైరెక్షన్ చేస్తానని తీసుకోవడానికి గల కారణమేంటి? అసలు ఈ సినిమాలో ఎవరు హీరోగా నటిస్తున్నారు అనే అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి.

    ఇక సోషల్ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం అయితే రాజమౌళి సందీప్ దగ్గర నుంచి ఒక కథ అయితే తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఆయన ఈ సినిమా డైరెక్ట్ చేస్తాడా? లేదంటే వేరేవాళ్ళతో డైరెక్ట్ చేయిస్తాడా? అనేది తెలియదు.

    కానీ మొత్తానికైతే సందీప్ దగ్గర ఒక కథని కావాలని అడిగి మరీ రాజమౌళి తీసుకున్నారట. ఇక ఏది ఏమైనా కూడా ఒకవేళ సందీప్ వంగ కథని రాజమౌళి కనక డైరెక్ట్ చేస్తే మాత్రం అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందననే చెప్పాలి. నిజానికి రాజమౌళి చేసే సినిమాలు ఫ్యామిలీ సబ్జెక్టులే కాకుండా భారీ ఎలివేషన్స్, ఎమోషన్స్ తో కూడా ఉంటాయి.

    కాబట్టి సందీప్ వంగ ఈ జనరేషన్ కి తగ్గట్టుగా కథలను రాసుకుంటూ ఉంటాడు. మరి వీళ్ళిద్దరి మైండ్ సెట్ కి సెట్ అవుతుందా అని కొంతమంది విమర్శకులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు… చూడాలి మరి ఈ సినిమా పట్టలెక్కుతుందా లేదా అనేది…