https://oktelugu.com/

Pushpa 2 : పుష్ప 2 సినిమాతో డిసెంబర్ 5 వ తేదీన ఇండస్ట్రీ రికార్డ్ లు బ్రేక్ అవ్వబోతున్నాయా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో మన హీరోలు వరుస సినిమాలను చేస్తూ పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నారు. మునిపెన్నడూ లేని విధంగా సక్సెస్ లను సాధించడంతో మన హీరోలు వరల్డ్ లెవల్లో వాళ్ళను వాళ్ళు స్టార్ హీరోలుగా ఎలివేట్ చేసుకుంటున్నారు. ఇక ఏది ఏమైనా కూడా మనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడంలో మన హీరోలు టాప్ లెవల్లో ఉన్నారనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : November 5, 2024 / 08:43 AM IST

    Is Pushpa 2 going to break industry records on December 5?

    Follow us on

    Pushpa 2 : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మన స్టార్ హీరోలు వాళ్ళ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ రికార్డులను క్రియేట్ చేస్తున్నారు. నిజానికి పాన్ ఇండియాలో తెలుగు సినిమా మార్కెట్ భారీ ఎత్తున పెరిగిపోయిందనే చెప్పాలి. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీని సైతం బీట్ చేస్తూ మనవాళ్లు చేసే సినిమాలు ఇండస్ట్రీ హిట్టుగా నిలవడమే కాకుండా వాళ్ల కంటూ ఒక సెపరేట్ ఐడెంటిటీని కూడా క్రియేట్ చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో మన స్టార్ హీరోల నుంచి వచ్చే సినిమాల మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచానలైతే అయితే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే డిసెంబర్ 5వ తేదీన పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ మరొకసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే పుష్ప ఇచ్చిన హై మూమెంట్ తో ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ అయితే క్రియేట్ అయింది. ఇక దానికి తగ్గట్టుగానే ‘పుష్ప 2’ సినిమా మీద కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. మరి వాటిని తట్టుకొని ఈ సినిమా భారీ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందా? లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది.

    ఇక అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో చేస్తున్న ఈ సినిమా ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధిస్తుందంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ఇక బాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలైతే పెట్టుకున్నారు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం సినిమా యూనిట్ చెబుతున్న మాటలను బట్టి చూస్తే పుష్ప 2 సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

    ఇక ‘బాహుబలి 2’ సినిమా 2000 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమా ఆ రికార్డును బ్రేక్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా రికార్డును బ్రేక్ చేయడం అంతా ఆషామాషీ వ్యవహారం అయితే కాదు. సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటే తప్ప అది వర్కౌట్ కాదు.

    అలాగే ఈ సినిమాని జనాలు రిపీటెడ్ గా చూసెంత ఇంపాక్ట్ ను ప్రేక్షకుల్లో క్రియేట్ చేయాలి. ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్ పాన్ ఇండియాలో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడనేది తెలియాల్సి ఉంది. ఇక సుకుమార్ కూడా ఈ సినిమాతో పాన్ ఇండియా లో ఉన్న స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరబోతున్నాడు…