Rajasaab : ప్రభాస్ లాంటి నటుడు వైవిద్య భరితమైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. నిజానికి పాన్ ఇండియాలో ఆయనను మించిన నటుడు ప్రస్తుతానికైతే ఎవరూ లేరనే చెప్పాలి. వరుసగా పాన్ ఇండియా సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకుంటున్న ఆయన రికార్డుల మీద రికార్డులను సృష్టిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఆయన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లో మంచి గుర్తింపును సంపాదించుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు ఎవ్వరికి అందనంత ఎత్తులో ముందుకు సాగుతున్నాడు. ఇక బాలీవుడ్ హీరోలైతే ప్రభాస్ ను చూసి కుళ్ళు కుంటున్నారనే చెప్పాలి. వాళ్లు ఒక్క సక్సెస్ ని కొట్టడానికే నానా తంటాలు పడుతుంటే ప్రభాస్ మాత్రం వరుసగా సక్సెస్ లను సాధిస్తూ 1000 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టే సినిమాలతో ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో చేస్తున్న రాజాసాబ్ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఒక మోషన్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్ తో సినిమా మీద అంచనాలను పెంచేసిన మారుతి ఈ సినిమాని థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి మొత్తానికైతే ఈ సినిమాలో ప్రభాస్ దెయ్యం క్యారెక్టర్ లో నటించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
మరి ఆయన దెయ్యంలా నటిస్తే అభిమానులు దానిని జీర్ణించుకోగలుగుతారా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. మరి మొత్తానికైతే ఒక స్టార్ హీరోతో దయ్యం పాత్రని చేయిస్తున్న మారుతి దానిని సినిమాలో ఎలా కన్వే చేస్తాడు అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది.
ఒక్కసారి మారుతి డైరెక్షన్ లో నటించడానికి సిద్ధమైన ప్రభాస్ అతన్ని ఏ డౌటు అడగకుండా అతను ఏది చెప్తే అది చేస్తూ ముందుకు సాగుతున్నాడట. మరి ఈ సినిమా ప్రభాస్ కెరియర్ లో మంచి కమర్షియల్ సినిమాగా మారుతుందనే చెప్పాలి.
ఇక ఇప్పుడు ఈ సినిమాతో ప్రభాస్ కనక భారీ సక్సెస్ ని సాధిస్తే మాత్రం మూడు సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్న హీరోగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదిస్తాడు.ఇక దానికి తగ్గట్టుగానే మారుతి కూడా ఈ సినిమాని భారీ లెవెల్లో తెరకెక్కిస్తూ సగటు ప్రేక్షకుడిని మెప్పించే విధంగా సినిమాను తీర్చే దిద్దుతున్నాడట…చూడాలి మరి మారుతి ఈ సినిమాతో భారీ సక్సెస్ ను సాధిస్తాడా లేదా అనేది…